Vijaya Sai Reddy: అమరావతిలోని తాడేపల్లిలో వైసీపీ బీసీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, పలువురు బీసీ మంత్రులు, బీసీ కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు, ఐపాక్ సహకారంతో ఈ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని విజయసాయిరెడ్డి సూచించారు. అప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై కూడా పోరాటం చేయాలని…
Vijay Sai Reddy: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. హాలీవుడ్ మీడియా సైతం ఆర్.ఆర్.ఆర్ మూవీని కీర్తిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆర్.ఆర్.ఆర్ మూవీని కొనియాడుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘RRR చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్…
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ చేతుల మీదుగా డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, కృష్ణయ్య, బీద మస్తాన్ రావు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని తిరిగి రెండోసారి ఎంపికచేశారు సీఎం జగన్. అలాగే బీసీ వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావు, సుప్రీంకోర్టులో న్యాయవాది ఎస్,నిరంజన్‌రెడ్డిలకు జగన్…
ఏపీలో ఉత్కంఠ రేపుతున్న రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధుల ఖరారు పూర్తయింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు అవకాశం ఇచ్చారు. బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంనుంచి ఖాళీ అయిన నాలుగు స్థానాలకు అభ్యర్ధుల్ని ఫైనల్ చేశారు. నాలుగింట సగం స్థానాలు బలహీన వర్గాలకే ఇచ్చారని, ఈ స్థాయిలో బలహీన వర్గాలకు…
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పును కళ్లారా చూశామని, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని ఆయన మర్యాద పూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శి మినహాయించి అన్ని చోట్లా గెలిచామన్నారు. ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలకు సంకేతాలుగా భావించాలన్నారు. గత ఎన్నికల్లో కొడుకు మంగళగిరిలో ఓడిపోతే.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓటమి పాలయ్యారన్నారు. ఈ ఫలితాలను చంద్రబాబు అర్థం చేసుకోవాలని విజయసాయిరెడ్డి…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు సానుభూతి రాజకీయాలకు తెరలేపారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘అన్ని ఎన్నికల్లో ఓడి తలబొప్పి కట్టడంతో సానుభూతి కోసం కుప్పంలో వీధి నాటకాలకు తెరతీశాడు చంద్రబాబు. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులు చేయించాడు. తనపైనే ఎవరో దాడి చేస్తున్నట్లు నిద్దట్లో కలవరిస్తూ ఆ ఫస్ట్రేషన్ జనంపై చూపిస్తున్నాడు. ఏంటి బాబు ఈ డ్రామాలు? ఓట్ల…
ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష.. దీనికి ప్రతిగా వైసీపీ ప్రజాగ్రహ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగితే రాష్ట్ర బంద్ చేస్తారా అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో ట్వీట్లు చేశారు. జగన్ గారి హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దని, ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారన్నారు విజయసాయిరెడ్డి. టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉనికిని…