పులి వేట ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పులి టార్గెట్ చేస్తే ఖచ్చితంగా దానికి దొరికిపోతుంది. కానీ, ఓ చిన్నబాతుమాత్రం పులికి చుక్కలు చూపించింది. చిన్న కొలనులో ఉన్న బాతును అమాంతం మింగేసేందుకు కొలనులోకి దూకింది. కానీ, అందులో ఉన్న బాతు ఆ పులికి దొరకలేదు సరికదా పులిని ముప్పుతిప్పలు పెట్టింది. పులి దగ్గరకు రాగానే నీటిలో మునిగి మరోచోట తెలింది. అక్కడికి వస్తే ఆ బాతు అక్కడి నుంచి తప్పించుకొని మరలా వేరే చోట తేలింది. పులిని ఆ చిన్నబాతు ముప్పుతిప్పలు పెట్టడంతో చేసేదిలేక ఆ పులి అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది.