Vidadala Rajini: గుంటూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ మంత్రి విడదల రజిని తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో తనపై అక్రమ కేసులు పెట్టించారని, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే ఈ కుట్రకు దర్శకుడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాపార లావాదేవీలకు సహకరించమని తనపై ఒత్తిడి తెచ్చారని, అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించారు. అంతేకాకుండా.. నా మీద అక్రమ కేసులు పెట్టించి, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె వాపోయారు.…
పోచారం ఐటీ కారిడార్‌లో సైకో వీరంగం.. దాడిలో చిన్నారి మృతి మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో వీరాంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్నవారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన జగేశ్వర్ తన భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారం మునిసిపాలిటీలో…
మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామాపై మాజీ మంత్రి విడదల రజని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ప్రతిపక్షంగా ఉన్న సమయంలో పార్టీకి అండగా ఉండాలని, ఇలా రాజీనామాపై చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో చేస్తున్న అరాచకాలు శాసనమండలిలో ప్రశ్నించి ఉంటే.. ఆయనకు మరింత గౌరవం పెరిగి ఉండేదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశానుసారం గత ఎన్నికల్లో తాను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశానని తెలిపారు. ఇంతవరకు గుంటూరు వెస్టులో…
రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత ఎరిగి పనిచేయాలని హితవు పలికారు. రైతులు, ప్రజా ప్రతినిధుల, మంత్రివర్యుల నుంచి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పరిష్కారంలో జాప్యం పై అసహనం వ్యక్తం చేశారు. అధిక మొత్తంలో సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనం అందేలా వ్యవసాయ యాంత్రికరణను, సూక్ష్మ సేద్య పరికరాలకు…
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం అందాలని ఆశయంతో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకంను ప్రారంభించారని తెలిపారు.
పోలీస్ బాస్‌లు పొలిటికల్ బాస్‌ల కోసం, పనిచేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజనీ విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలని మాటలకే పరిమితమయ్యాయన్నారు. ఆ లోపాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు.
వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం కాకరేపుతున్నాయి. హైదరాబాద్ లో మకాం వేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. వైసీపీకి బాలినేని రాజీనామా చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. రెండు రోజుల క్రితం పార్టీ అధినేత జగన్ తో బాలినేని శ్రీనివాస రెడ్డి సమావేశమయ్యారు.
గుంటూరు పట్టణంలోని సాయిబాబా రోడ్డు దగ్గర మౌరియా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి విడదల రజినీ, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయాలపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున దాడులకు దిగారు.
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్దిగా విడదల రజనీ పోటీ చేస్తున్నారు. అయితే.. ఎన్నికల ప్రచారం భాగంగా నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు విడదల రజిని. ప్రచారంలో అడుగడుగునా విడదల రజినికి ప్రజలు నీరాజనం పట్టారు. తమ మద్దతు విడదల రజినికే అంటూ నినాదాలు చేశారు. హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. విడదల రజిని ప్రచారంలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత చేసిన…