భారత భాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఉప రాష్ట్రపతి అయిన సమయంలో ఆయన అనుభవించిన బాధను పంచుకున్నారు.. ఉపరాష్ట్రపతి అయిన సందర్భంలో తాను పార్టీ (భారతీయ జనతా పార్టీ)ని వీడినందుకు చాలా బాధపడ్డానని గుర్తుచేసుకున్నారు… చిన్నప్పుడు తల్లి ప్రేమకు నోచుకోలేదు.. చిన్నప్పుడే తల్లి మరణించడంతో అమ్మమ్మ పెంచింది.. నన్ను పార్టీయే ఇంత వాడిని చేసింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు.. Read Also: Katrina Kaif: అసలు…
భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్ మార్గరెట్ అల్వా బరిలో ఉన్నారు.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్ మార్గరెట్ అల్వా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పార్లమెంట్ భవనంలో కొనసాగనుంది.
President's flag: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రేపు ఆదివారం (జూలై 31న) తమిళనాడు పోలీసులకు ప్రెసిడెంట్స్ ఫ్లాగ్‌ను అందజేయనున్నారు. ఈ కార్యక్రమం చెన్నైలోని రాజారత్నం స్టేడియంలో జరగనుంది. ఇందులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొననున్నారు.
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేపట్టిన బీజేపీ ఎట్టకేలక ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసింది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగదీప్ ధన్‌కర్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జేపీ నడ్డా ప్రకటించారు.
ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు దాదాపు ఖరారైంది. కాసేపట్లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇటీవల బీజేపీ ముఖ్యనేత అయిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ వైఖరి ఏంటి? విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తుందా? దక్షిణాది లేదా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు బరిలో ఉంటే ఏం చేస్తారు? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీ. హైదరాబాద్ వచ్చిన సిన్హాకు ఘన స్వాగతం పలికింది కూడా. ఇదే అంశంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, NCP చీఫ్ శరద్ పవార్ నిర్వహించిన సమావేశాలకు టీఆర్ఎస్ వెళ్లలేదు.…
కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేసింది. జులై 7వ తారీఖు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 19వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నామినేషన్లను జులై 20వ తేదీన పరిశీలించనున్నారు. ఎవరైనా నామినేషన్లను ఉపసంహరణ చేసుకోవాలనుకుంటే.. జులై 22వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆగస్టు 6వ తేదీన పోలింగ్ ఉండనుంది. అదే రోజే కౌంటింగ్ చేయనున్నారు. ఉదయం 10 నుంచి 5 గంటల…