రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠకు తెరదించే అవకాశం ఉంది. ఈ భేటీలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొననున్నట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు భాజపా అధిష్ఠానం ఇప్పటికే కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో…
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల సందడి నెలకొంది. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఎన్డీయే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీ డిమాండ్ చేసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏ పక్షాలు అభ్యర్థి కోసం పాకులాడుతున్నాయి.. తపన పడుతన్నాయి. చేతిలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఉంచుకుని వేరే వారిని వెతుక్కోవడం దేనికి..? ఉప రాష్ట్రపతులు.. రాష్ట్రపతులు అయిన సంప్రదాయం మన దేశంలో…
ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం. ప్రతీ ఏటా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యోగా.. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుంది. అందుకే ప్రతీ ఏటా జూన్ 21న యోగా ప్రాధాన్యతను తెలియజెప్పేలా కేంద్ర ప్రభుత్వం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ యోగా కార్యక్రమాల్లో పాల్గొని.. ప్రజల్లో దాని పట్ల అవగాహన పెంచుతున్నారు. ఈసారి మోదీ కర్ణాటకలోని…
సినిమాల తీరును చిత్ర పరిశ్రమ సరిద్దిదుకోవాలని భారత ఉప రాష్త్రాతి వెంకయ్య నాయుడు సూచించారు. నేడు సిరివెన్నెల సీతారామశాస్ర్తి జయంతి సందర్భంగా హైదరాబాద్ శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ” సిరి వెన్నెల రాసిన ప్రతి పాట, మాటలో సందేశం ఉంటుంది. సిరి వెన్నెలతో నాకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఆయన గురువు సత్యరావు మాస్టారు మా స్నేహితుడు.. ఇప్పుడు సిరి వెన్నెల సమగ్ర సాహిత్య పుస్తకాన్ని…
మనల్ని పాలించే నేతలు ఎలా వుండాలి? వారి ప్రవర్తన ఎలా వుండాలి? అనేదానిపై ప్రజలు ఆలోచించాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. విజయవాడలో విద్యార్థులతో ముఖాముఖి లో వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులను ఎన్నుకునే ముందు కులం మతం చూసి ఎన్నుకోకూడదన్నారు. నేతల కులం కన్నా గుణం మిన్న అన్నారు వెంకయ్యనాయుడు. మంచి వారిని సేవా భావం ఉన్న వారిని ప్రోత్సహించాలి నాయకుడిగా ఎన్నుకోవాలి. పార్లమెంట్ కి అసెంబ్లీకి పోయి మాట్లాడేటప్పుడు సభ్యతతో సంస్కారంతో…
ఒకప్పుడు గ్రంథాలయం లేని ఊరు, పట్టణం వుండేదికాదు. కాలక్రమేణ టెక్నాలజీ పెరిగిందనే సాకుతో గ్రంథాలయాలు కనిపించకుండా పోతున్నాయి. విజయవాడలో రామ్మోహన గ్రంధాలయ సందర్శనకు వచ్చిన ఉప రాష్ట్రపతి తాజా పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంధాలయం, దేవాలయం, సేవాలయం ప్రతీ ఊరిలో ఉండాలి. రోజులు మారాక గ్రంధాలయాలు కనపడటం లేదు. గతంలో రామ్మోహన గ్రంధాలయంలో ఉపన్యసించే వాడిని. పుస్తకం అందరి చేతిలో ఉండాలి. పుస్తకాలు చదవడం అందరూ అలవరుచుకోవాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సర్ధార్ వల్లభాయ్ పటేల్…
కోవిడ్ టీకాపై అపోహలు అవసరం లేదు అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే మన దేశంలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చి దాదాపు 8 వేళలు అవుతున్న కొంత మంది టీకా తీసుకోవడానికి ఇంకా సంకోచిస్తున్నారు. అయితే టీకాపై ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ… టీకాకరణ కార్యక్రమం ప్రజాఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉంది. టీకానంతరం కూడా జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు వెంకయ్యనాయుడు. అసాధారణ సంక్షోభాన్ని అసాధారణ రీతిలోనే ఎదుర్కోవాలి, ఇందులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సమష్టికృషితో కరోనా…
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయంతే. ఏ కార్యక్రమం సరిగా సాగదు. ప్రశ్నలు లేవు.. సమాధానాలు లేవు. ఇక చర్చల ప్రసక్తే లేదు.. నినాదాలు ..ఇకటే రణగొణ ధ్వనులు . గత రెండు వారాలుగా పార్లమెంట్ లో ఇవి తప్ప మరొకటి ఉందా. ఇదీ మనం చూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తీరు. పంతం నెగ్గించుకోవటానికి ప్రతిపక్ష సభ్యులు దేనికైనా సిద్ధమంటున్నారు. కాగితాలు చింపుతారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్తారు. చైర్మన్ సీట్‌పైకి ఫైల్స్ విసిరేస్తారు.. టేబుల్…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో, అమెరికా దళాలు తప్పుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘన్ ఆర్మిని చెదరగోడుతూ అనేక ప్రాంతాలను స్వాదీనంలోకి తీసుకుంటున్నారు. ఇక పాక్ ఇప్పటికే తాలీబన్లకు మద్దతు ఇస్తున్నది. దీంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. మరోవైపు పాక్ ట్రోలర్లు ట్వట్టర్లో ఆఫ్ఘనిస్తాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. మంగళవారం రోజున బక్రీద్ సందర్భంగా అధ్యక్షభవనంలో సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ ప్రార్ధనల్లో అధ్యక్షుడితో పాటు ఉపాద్యక్షుడు అమ్రుల్లా సలే కూడా పాల్గోన్నారు. ప్రార్ధనలు జరిగే…