కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేసింది. జులై 7వ తారీఖు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 19వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నామినేషన్లను జులై 20వ తేదీన పరిశీలించనున్నారు. ఎవరైనా నామినేషన్లను ఉపసంహరణ చేసుకోవాలనుకుంటే.. జులై 22వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆగస్టు 6వ తేదీన పోలింగ్ ఉండనుంది. అదే రోజే కౌంటింగ్ చేయనున్నారు. ఉదయం 10 నుంచి 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆ తర్వాత కౌంటింగ్ జరగనుంది.