NDA Vice President Candidate: ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు దాదాపు ఖరారైంది. కాసేపట్లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇటీవల బీజేపీ ముఖ్యనేత అయిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి పదవి కోసమే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు గతంలో ఊహాగానాలు కూడా వినిపించాయి. ఆయనను ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నింపాలని ఎన్డీయే కూటమి యోచిస్తున్నట్లు జాతీయ మీడియాల్లో వరుసగా కథనాలు కూడా వచ్చాయి. ఇటీవల ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా నఖ్వీ కలిశారు. అనంతరం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది.
మంగళవారం జులై 19 ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్లకు ఆఖరు తేదీ కాగా… ఎన్నికలు అనివార్యం అయితే ఆగస్టు 6 శనివారం రోజున ఎన్నికలను నిర్వహించనున్నారు. లోక్ సభ, రాజ్యసభలకు చెందిన ఎంపీలు, రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారు అయ్యింది.
మరోవైపు ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించే విషయంలో ప్రతిపక్షాలు వెయిట్ అండ్ సీ పాలసీని ఫాలో అవుతున్నాయి. అందుకే ఇప్పటివరకు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. అధికార కూటమి (ఎన్‌డీఏ) క్యాండేట్ పేరును ప్రకటించాకే తమ అభ్యర్థి పేరును వెల్లడిస్తామని చెబుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలాగైతే ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపారో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం కూడా అలాగే జాయింట్ క్యాండేట్‌ని పోటీకి దింపాలని నిర్ణయించారు.
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ కూటమి ద్రౌపదీ ముర్ము పేరును ప్రకటించకముందే విపక్షాలు యశ్వంత్‌సిన్హా పేరును డిక్లేర్ చేశారు. కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రూలింగ్ పార్టీ ఏ అభ్యర్థిని బరిలోకి దించుతుందో సరిగ్గా అదే స్థాయి, అలాంటి ప్రొఫైలే కలిగిన నాయకుణ్ని సెలెక్ట్ చేయాలని అపొజిషన్ పార్టీలు అనుకుంటున్నాయి. తద్వారా గట్టి పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నిక ఇప్పటికే వన్ సైడ్ అయిన విషయం తెలిసిందే. ద్రౌపదీ ముర్ముకి రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది.