సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీ లపైన నమ్మకం కల్గించేలా పని చేయాలని, కొంత కాలం గా యూనివర్సిటీ పైన నమ్మకం తగ్గుతోందన్నారు సీఎం రేవంత్. యూనివర్సిటీ ల గౌరవాన్ని పెంచాలని ఆయన కోరారు. యూనివర్సిటీ ల్లో వ్యవస్థ లు దెబ్బతిన్నాయని, వ్యవస్థల పునరుద్ధరణ కు ఏం చేయాలో అధ్యయనం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వీసీ(వైస్ ఛాన్సలర్లు) నియామకానికి ప్రక్రియ ప్రారంభించింది. వీసీ పోస్టుల దరఖాస్తు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అర్హులైన వారు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. కాగా.. వీసీల పదవి కాలం మే లో ముగియనుంది. ఆ లోపే ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకోసం త్వరలో సెర్చ్ కమిటీలు వేయనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని రెండు వర్సిటీలకు వీసీలను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నియామకమయ్యారు. ప్రసాద్ రెడ్డి నియామకాన్ని ఖరారు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా స్టాలిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో యూనివర్సిటీల వీసీలను ప్రభుత్వమే నియమించేలా చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ మేరకు తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి సోమవారం నాడు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అన్నాడీఎంకే, బీజేపీ వ్యతిరేకించగా.. పీఎంకే పార్టీ సమర్థించింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా అసెంబ్లీలో…
ఏపీలో విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులు మారుతున్నాయి. కరోనా కారణంగా ఆగిన వివిధ రకాల విద్యావిధానాలు మళ్ళీ గాడిలోపడుతున్నాయి. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్‌లతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశం నిర్వహించారు. రాజ్‌భవన్ లో జరిగిన సమావేశంలో పలు అంశాలపై గవర్నర్ చర్చించినట్టు తెలుస్తోంది. యోగి వేమన, అచార్య ఎన్ జి రంగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాకినాడ జెఎన్ టియు, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. కరోనా పరిస్ధితులు కుదుట పడుతున్న నేపధ్యంలో…
తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వీసీలను కెసిఆర్ సర్కార్ నియమించింది. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత 10 యూనివర్సిటీలకు వీసీలను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఖరారు చేసిన వీసీల జాబితాపై గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆ జాబితాను ప్రకటించింది ప్రభుత్వం.వీసీలు : 1.ఉస్మానియా యూనివర్సిటీ, (హైదరబాద్) వీసీ గా ప్రొ. డి. రవీందర్ యాదవ్ (బీసీ) 2.కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) వీసీ గా ప్రో. టి.రమేష్ (బీసీ) 3.తెలంగాణ యూనివర్సిటీ, (నిజామాబాద్) వీసీ…