CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తో అన్ని యూనివర్సిటీల నూతన వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలక్రిష్ణా రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్లకి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీ లపైన నమ్మకం కల్గించేలా పని చేయాలని, కొంత కాలం గా యూనివర్సిటీ పైన నమ్మకం తగ్గుతోందన్నారు సీఎం రేవంత్. యూనివర్సిటీ ల గౌరవాన్ని పెంచాలని ఆయన కోరారు. యూనివర్సిటీ ల్లో వ్యవస్థ లు దెబ్బతిన్నాయని, వ్యవస్థల పునరుద్ధరణ కు ఏం చేయాలో అధ్యయనం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని, అవసరమైతే కన్సల్టెన్సీ లను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలన్నారు.
Shocking Video: భర్త చనిపోయిన బెడ్‌ను ఐదు నెలల గర్భిణితో శుభ్రం చేయించిన ఆస్పత్రి సిబ్బంది..
వైస్ ఛాన్సలర్లకి ఎవరి ప్రభావితం తో పోస్ట్ లు ఇవ్వలేదని, మెరిట్,సామాజిక సమీకరణాల ఆధారంగా వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు సీఎం రేవంత్. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్ల కి స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ సహకారం ఉంటుందని, యూనివర్సిటీ లను 100 శాతం ప్రక్షాళన చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల ను విద్యార్థులు యేళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లు..ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, యూనివర్సిటీ ల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాల పైన ద్రుష్టి సారించాలన్నారు. విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆయన సూచించారు.
Chiranjeevi: చిరంజీవి ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి