ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుపై కేంద్ర హోం మంత్రి అమి త్‌షా ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరయ్యారు. ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడితో కలిసి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్న నా అభిలాష ఇప్పటికి నేరవేరిందని హోం మంత్రి అమిత్ షా అన్నారు.
భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు ఎంతో కృషి చేశారన్నారు. కేంద్ర మంత్రి మొదలుకుని ఉపరాష్ర్టపతి వరకు ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చార న్నారు. వెంకయ్యనాయుడు యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ పిలుపుతో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. పార్టీ తరపున ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించడంతో పాటు ఎన్నో ఉన్నత స్థాయి చర్చల్లో కీలకంగా వ్యవహరించారన్నారు. రైతుల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో కేంద్రమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నారని అమిత్‌షా కొనియాడారు.
Addressing the 20th anniversary celebrations of the Swarna Bharat Trust in Venkatachalam, Andhra Pradesh. https://t.co/hHSHJB27vG
— Amit Shah (@AmitShah) November 14, 2021