భారతీయ కళలలో ప్రధానమైన కూచిపూడి నృత్యం గొప్పదనాన్ని తెలియ చెప్పేలా ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు ‘నాట్యం’ చిత్రం నిర్మించారు. అందులో ఆమె కథానాయికగానూ నటించడం విశేషం. కమల్ కామరాజు, రోహిత్, ఆదిత్య మీనన్, ‘శుభలేఖ’ సుధాకర్, భానుప్రియ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ‘నాట్యం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాను కొద్ది రోజుల ముందే భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు.
Read Also : “మా” వివాదం : ఇది శాంపిల్ మాత్రమే… ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్
శుక్రవారం ఈ సినిమా రిలీజ్ ను పురస్కరించుకుని తన అభిప్రాయాన్ని శ్రీ వెంకయ్య నాయుడు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ”నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్య కళాకారిణి శ్రీమతి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు” అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలానే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, రామ్ చరణ్ తదితర సినిమా ప్రముఖులు సైతం ‘నాట్యం’ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొని చిత్ర బృందానికి శుభాశీస్సులు అందించారు.
నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు. #Natyam pic.twitter.com/o6A8v23f1d
— Vice-President of India (@VPIndia) October 22, 2021