భారత దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే యువతే కీలకమని,మాతృభాషలో చదువుకోవడం అభివృద్ధికి ఏమాత్రం ఆటంకం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. విజయవాడలోని స్వర్ణభారత్ ట్రస్ట్ శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. యువత నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు స్వర్ణభారత్ ట్రస్ట్ పని చేస్తోందన్నారు.
భారత సనాతన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలించిందన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారందరూ మాతృ భాషలో నే విద్యను అభ్యసించారని ఆయన పేర్కొన్నారు. వ్యాయామంతోపాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ఆధ్యాత్మిక చింతన అలవర్చు కోవాలని సూచించారు. ఇవన్నీ మతానికి సంబంధించినవి కావని, మంచి ఆధ్యాత్మిక చింతన ద్వారా సామాజిక బాధ్యత అలవడుతోం దన్నారు. జంక్‌పుడ్ సంస్కృతిని మానుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.