అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా పోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. తనకు తానుగా వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Venezuela: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అమెరికాపై విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ‘‘ఇంధన దురాశ’’తో వ్యవహరిస్తున్నారని అన్నారు. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌లో పాలుపంచుకుంటున్నారని, డ్రగ్స్ ముఠాలకు నేతృత్వం వహిస్తున్నారని వెనిజులా అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురోను అమెరికా దాడి చేసి నిర్బంధించిన తర్వాత, రోడ్రిగ్జ్ మాట్లాడుతూ..
US-Venezuela: వెనిజులా చమురు విక్రయాలను తామే నియంత్రిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అమెరికా ఖాతాల్లోనే ఉంచుతామని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ అన్నారు. వెనిజులాకు చెందిన అత్యంత విలువైన వనరైన చమురును ప్రపంచ మార్కెట్‌లోకి ఎలా తీసుకురావాలనే దానిపై అమెరికా క్లారిటీ ఇచ్చింది.
US-Russia: రష్యన్ ప్లాగ్ కలిగిన ఆయిల్ ట్యాంకర్‌ను యూఎస్ దళాలు సీజ్ చేశాయి. అట్లాంటిక్ మీదుగా ప్రయాణిస్తున్న ఈ చమురు ట్యాంకర్‌ను గత రెండు వారాలుగా యూఎస్ ట్రాక్ చేస్తోంది.
వెనిజులాకు ట్రంప్ మరో స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశారు. తక్షణమే చైనా, రష్యా, ఇరాన్, క్యూబాతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని డెల్సీ రోడ్రిగ్జ్ నేతృత్వంలోని వెనిజులా ప్రభుత్వానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
వెనిజులా చమురుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మార్కెట్ ధరకే వెనిజులా నుంచి 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురు కొనుగోలు చేస్తామని తెలిపారు. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని తెలిపారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్నాక అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు. చమురు, ఎన్నికలు, ఇన్‌ఛార్జ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులా భవిష్యత్ ప్రణాళికను ట్రంప్ వెల్లడించారు.
వెనిజులాపై అమెరికా సైన్యం దాడి తర్వాత ఎక్కువగా మార్మోగుతున్న పేరు నికోలస్ మదురో. శనివారం తెల్లవారుజామున అధ్యక్ష భవనంపై యూఎస్ దళాలు మెరుపు దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో.. అతని భార్య సిలియా ఫ్లోర్స్‌ను కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించారు. అనంతరం వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
వెనిజులా వ్యవహారం ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. శనివారం వెనిజులాపై అమెరికా భీకరమైన సైనిక చర్యకు దిగి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను.. అతని భార్య సిలియా ఫ్లోర్స్‌ను కారకాస్‌లో బంధించి అమెరికా తరలించింది.