విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా ‘ఎఫ్ 3’. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ’ఎఫ్ 2’ సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే తదుపరి షెడ్యూలు షూటింగును ప్రారంభించనున్నారు. కాగా, ఓ ప్రత్యేకమైన పాట కోసం కథానాయిక ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈమేరకు…
‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను అందుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. అతనితో సినిమా చేయడానికి చాలామంది యంగ్ హీరోలు సిద్ధంగా ఉన్నారు. కానీ పర్ ఫెక్ట్ ప్రాజెక్ట్ ను సెట్ చేయాలనే ఆలోచనతో వెంకీ కుడుముల నింపాదిగా ముందుకు కదులుతున్నాడు. పలువురు అగ్ర కథానాయకులకు వెంకీ కుడుముల ఇప్పటికే కథలు చెప్పాడట. డేట్స్ లేక కొందరు తర్వాత చూద్దాం అని అంటే, మరి కొందరు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారట. ఇదిలా ఉంటే……
రీమిక్స్ సాంగ్ అనగానే చాలామంది పెదవి విరుస్తారు. తమ చిత్రాలకు క్రేజ్ తెచ్చుకోవడం కోసం ఒరిజినల్ ఫ్లేవర్ ను చెడగొడుతూ ఇష్టం వచ్చినట్టుగా గాయనీ గాయకులతో పాడించేస్తుంటారని కొందరు విమర్శిస్తే… పాత బాణీలకు వెస్ట్రన్ ఇన్ స్ట్రుమెంట్స్ తో హోరెత్తించేస్తుంటారని మరికొందరు మండిపడతారు. కాని ఒక్కోసారి రీమిక్స్ సాంగ్స్ సైతం కొత్త సంగీత దర్శకులకు, గాయనీ గాయకులకు పేరు తెచ్చిపెడుతుంటాయి. ఆ మధ్య వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రం కోసం శోభన్ బాబు ‘దేవత’ చిత్రంలో వెల్లువొచ్చి…
దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. అయితే… ఒక్కోసారి ఎంత సక్సెస్ ట్రాక్ లో ఉన్న వారికైనా సినిమాను సెట్ చేయడానికి ఊహకందని అడ్డంకులు ఎదురవుతుంటాయి. ప్రసన్నకుమార్ చెప్పిన ఓ కథ నచ్చి, దానిని రవితేజ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించడానికి ముందుకొచ్చింది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఖిలాడీ చిత్రంలో నటిస్తున్న రవితేజ… ఆ తర్వాత శరత్ మండవ…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న10వ సినిమా ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయిక నటిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో, రినైస్సాన్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్‌లో అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ జులై నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాక్సింగ్…
కరోనా మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ కారణంగా సినిమా షూటింగులను కూడా నిలిపివేశారు. దీంతో సెలెబ్రిటీలతో సహా సామాన్యులంతా మరోసారి ఇళ్లకు పరిమితమైపోయారు. ఈ సమయంలో కొంతమంది సెలెబ్రిటీలు కొత్త హ్యాబిట్స్ అలవర్చుకుంటే… మరికొంతమంది తమలోని టాలెంట్ ను బయటకు తీస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో లాక్డౌన్ సమయంలో కొత్తగా సంపాదించిన నైపుణ్యాన్ని వరుణ్ ప్రదర్శించాడు. తన ముక్కుపై…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రం వరుణ్ తేజ్, సాయి పల్లవి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. అటు వసూళ్లలోనూ, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అయితే తాజాగా వరుణ్, సాయిపల్లవి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ‘ఛలో’ ‘భీష్మ’ సినిమాలతో తనదైన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల వరుణ్ తేజ్ కి ఒక కథ వినిపించి ఓకే చేశారనే టాక్…
వెంకీ, వరుణ్ తో అనిల్ రావిపూడి తీసిన ‘ఎఫ్2’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసి ఘన విజయం సాధించింది. ఇక ఆ సినిమాకు సంక్రాంతి పండగ కూడా కలసి వచ్చింది. నిజానికి అనిల్ రావిపూడి నటించిన సినిమాలు సంక్రాంతికే వచ్చి వరుసగా విజయాలు సాధించాయి. దాంతో సంక్రాంతి అనిల్ కి సెంటిమెంట్ గా కూడా మారింది. గత సంవత్సరం మహేశ్ తో అనిల్ తీసిన ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’కి సీక్వెల్ గా ‘ఎఫ్3’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ను ఉగాది పండగ రోజున స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ మేరకు సెట్స్ లోని పిక్స్ షేర్ చేస్తూ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. ‘ఈ ఇయర్ మొత్తం ఓన్లీ ఆనందం అండ్ ఫన్ ఉండాలి… నో శాడ్ నెస్ అండ్ టెన్షన్స్……