వెంకీ, వరుణ్ తో అనిల్ రావిపూడి తీసిన ‘ఎఫ్2’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసి ఘన విజయం సాధించింది. ఇక ఆ సినిమాకు సంక్రాంతి పండగ కూడా కలసి వచ్చింది. నిజానికి అనిల్ రావిపూడి నటించిన సినిమాలు సంక్రాంతికే వచ్చి వరుసగా విజయాలు సాధించాయి. దాంతో సంక్రాంతి అనిల్ కి సెంటిమెంట్ గా కూడా మారింది. గత సంవత్సరం మహేశ్ తో అనిల్ తీసిన ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత కరోనా వల్ల ఈ ఏడాది సంక్రాంతికి అనిల్ సినిమా ఏదీ రాలేదు. ప్రస్తుతం ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా వెంకటేశ్, వరుణ్‌తేజ్ తో ‘ఎఫ్3’ తీస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయాలని భావించారు నిర్మాత దిల్ రాజు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల అది నెరవేరే సూచనలు కనిపించటం లేదు. కానీ అది కూడా అనిల్ రావిపూడి కి కలసి రానుందంటున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. సెంటిమెంట్ కూడా కలసి వస్తుందనే అలా చేయాలనుకుంటున్నారట. ఇటు అనిల్ కు అటు దిల్ రాజుకు సంక్రాంతి బాగా అచ్చివచ్చింది. ఎఫ్3లో సినిమా కథ డబ్బు సంపాదన చుట్టూ తిరుగుతుందట. ఆ సందర్భంగా వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తాయని అంటున్నారు. ఇందులో సునీల్ పాత్ర ప్రత్యేక ఆకర్షణ అవుతుందట. మరి మరోసారి అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందేమో చూద్దాం.