మెగా కజిన్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముగ్గురూ కలిసి దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ లో వీరు ముగ్గురూ పడుకుని ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దొరికిన ఖాళీ సమయంలో ఈ మెగా కజిన్స్ ముగ్గురూ ఒకే దగ్గర చేరినట్టు కన్పిస్తోంది. ఈ పిక్ ను మెగా అభిమానులు ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా “గని” చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. జూన్ లేదా జూలైలో “గని” చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ యంగ్ హీరో “ఎఫ్ 3” చిత్రంలోనూ నటిస్తున్నాడు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయితేజ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Read Also : ‘మా’ అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు
ఇక వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘ఉప్పెన’. భారీ కలెక్షన్లతో వైష్ణవ్ తేజ్ కెరీర్లో మరిచిపోలేని చిత్రంగా మిగిలింది. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్… వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న ఈ రెండు చిత్రాలను నిర్మించనున్నారు. సుకుమార్ ఆ రెండు చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక ఈ యంగ్ హీరో త్వరలో తన మూడవ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నాడు. ఈ చిత్రానికి గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఎస్‌విసిసి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇక వైష్ణవ్ ఇప్పటికే క్రిష్ దర్శకత్వం వహించిన తన రెండవ చిత్రం ‘కొండపాలెం’ షూటింగ్ ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ మెగా హీరోలంతా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.