యూపీలో ప్రధాని మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ సొంత నియోజక వర్గంలో డైరీ, విద్య, ఆరోగ్యం వంటి 22 రకాల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేశారు. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో పశువుల పోషణకు గర్వ పడుతున్నానని, కాని కొందరు మాత్రం దానిని పాపంగా పోలుస్తున్నారని అన్నారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు పశువులపై ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి పశువులపై జోక్ వేయడం మంచిది కాదని ప్రధాని మోడీ పేర్కొన్నారు.…
ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. వారణాసిలోని కలాభైరవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు స్థాపన కోసం ఢిల్లీ నుంచి వారణాసి చేరుకున్నారు ప్రధాని మోడీ.. ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఇక, అక్కడి నుంచి నేరుగా కాలభైరవ ఆలయానికి చేరుకున్న ప్రధాని.. కాలభైరవున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక, కాశీ విశ్వనాథ్ ప్రాజెక్ట్ కారిడార్‌కు ప్రారంభించనున్నారు భారత ప్రధాని.. 2019లో దీనికి శంకుస్థాపన చేశారు.…
ఉత్తరప్రదేశ్‌లోని ‘కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు’ ను సోమవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని గంగా ఘాట్లతో ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దివ్యకాశీ-భవ్యకాశీగా నామకరణం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరం మొత్తాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయాలు, వీధులన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. 2019లో ఈ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. స్థానికుల నుంచి భూసేకరణ జరిపి, మొత్తం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో…
రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామాంధులు కామంతో రగిలిపోతూ చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా ఒక స్వీపర్.. స్కూల్ టాయిలెట్ కి వచ్చిన బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. వారణాసిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో సింకు అనే వ్యక్తి స్వీపర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం స్కూల్లో క్లాసు జరుగుతుండగా ఒక బాలిక టాయిలెట్ కని లోపలి వెళ్ళింది. అక్కడ టాయిలెట్ క్లీన్ చేస్తున్న సింకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె…
వారణాసిలోని వీధుల్లో అడుక్కుంటున్న ఓ మహిళ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతోంది. ఆమె పేరు స్వాతి. ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న దుకాణం వద్ద టిఫిన్ చేస్తూ స్వాతి ఇంగ్లీష్ మాట్లాడటాన్ని గుర్తించాడు. దీంతో అతడు స్వాతి గురించి ఆరా తీయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. దీంతో అతడు స్వాతిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఫేస్బుక్లో ఈ వీడియోలను 78వేల మంది వీక్షించారు. స్వాతి సైన్స్ గ్రాడ్యుయేట్…
ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఇవాళ వారణాసి వెళ్తనున్నారు. ఆయన తూర్పు యూపీలోనే రెండు రోజులపాటు పర్యటించనున్నారు. బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో అమిత్ షా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా పాల్గొనే అవాకశముంది. బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్లు,…
భారత్‌లో హిందూవులకు, ముస్లింలకు మధ్య విభేదాలకు కారణమైన విషయాల్లో అయోధ్య ఒకటి. దీంతో చాలా మంది అయోధ్య రాముడిని హిందూవులు మాత్రమే కొలుస్తారని భావిస్తారు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. రాముడిని ముస్లింలు కూడా పూజిస్తారు అని చెప్పడానికి తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ. వారణాసిలోని రామాలయంలో దీపావళి రోజున అయోధ్య రాముడికి ముస్లింలు హారతి ఇవ్వడం 15 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అందుకే ప్రతి ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా రాముడికి ముస్లిం…
ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో మహిళలకు ప్రోత్సహించాల్సిన నేతలు వారిని తక్కువచేసి మాట్లాడుతున్నారు. చీకటి పడ్డాక మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే కుటుంబంలోని పురుషులను తోడుగా తీసుకెళ్లడం మంచిది అని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి అన్నారు. వారణాసిలోని బజర్డిహా ప్రాంతంలో వాల్మీకి బస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్లో మహిళా…