జ్ఞానవాపీ మసీదు వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఐదుగురు మహిళలు జ్ఞాన్‌వాపి మసీదు పశ్చిమ గోడ వెనుక భాగంలో ఉన్న శృంగార్ గౌరీ, గణేశ, హనుమంతుడు పూజలకు అనుమతి ఇవ్వాలని కోరడంతో వారణాసి కోర్ట్ వీడియోగ్రఫీకి ఆదేశించింది. మే 14-16 తేదీల్లో కోర్ట్ కమిషనర్ల ఆధ్వర్యంలో వీడియో సర్వే చేశారు. అయితే వీడియో సర్వేను నిలిపి వేయాలంటూ అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంను ఆశ్రయించింది అయితే.. సుప్రీం కోర్ట్ ఈ కేసును వారణాసి జిల్లా కోర్ట్ కు బదిలీ చేసింది.
ఇదిలా ఉంటే వీడియోగ్రఫీకి సంబంధించి కొన్ని వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నేషనల్ మీడియా ఈ వీడియోలకు చాలా ప్రాధాన్యతలు ఇస్తూ న్యూస్ రన్ చేసింది. అయితే వీడియోగ్రఫీ సర్వేలో వీడియో గ్రాఫర్ గా ఉన్న గణేష్ శర్మ ప్రస్తుతం సంచలన విషయాలు బయటపెట్టాడు. అయితే ఆయన సర్వేలో భాగంగా వాజూ ఖానాలోని కొలనులో శివలింగం బయటపడినట్లు చెప్పాడు. ముస్లిం సంఘాలు ఆరోపించినట్లుగా ఇది పౌంటెన్ అనే వ్యాఖ్యలను కొట్టిపారేేశాడు. హిందూ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ కూడా ఇది కాశీ విశ్వనాథ్ కారిడార్ లో భాగమే అని నిర్థారించేందుకు కొన్ని ఆధారాలు బయటపడ్డాయని అన్నారు.
ఇదిలా ఉంటే జ్ఞాన్‌వాపి మసీదు వైపు చూస్తున్న నందికి ప్రస్తుతం శివలింగ ఆకారం బయటపడిన చోటుకు మధ్య ఖచ్చితంగా 83 అడుగుల దూరం ఉంది. శివలింగం అనడానికి ఇదే నిదర్శనం అని.. ఇదే కాకుండా శివలింగం పవిత్రం చేయడానికి ఆలయంలో ఒక బావి ఉందని.. దిగువన హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు ఉన్నాయని… స్తంభాలపై త్రిశూలం గుర్తులు, సంస్కృత శ్లోకాలు ఉన్నాయని విష్ణు శంకర్ జైన్ తెలిపారు.