జ్ఞాన్వాపి మసీదు వివాదం కొత్తది కాదు. చాలా కాలంగా నడుస్తున్నదే. ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోందో తెలుసుకోవాలి. 1991లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు ఈ చట్టం చేశారు. 1991లో అయోధ్యలోని రామ జన్మభూమిలో ఆలయాన్ని నిర్మించాలనే ఉద్యమం సాగుతున్న సమయంలో అంటే, అద్వానీ రథయాత్ర, యూపీలాంటిచోట్ల మతరపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న రోజుల్లో, 1991 సెప్టెంబర్ 18న నాటి పివి…
జ్ఞానవాపి మసీదు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ నెల 14-16 వరకు సర్వే జరిగింది. మసీదులోని వాజుఖానా ప్రదేశంలోని కొలనులో శివలింగం బయటపడిందనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు సర్వేను నిలిపివేయాలంటూ… అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించింది. ఇటీవల సుప్రీం కోర్ట్ ఈ వివాదంపై విచారణ జరిపింది. శివలింగం బయటపడిన ప్రాంతానికి రక్షణ కల్పించడంతో పాటు ముస్లింలు ప్రార్థన…
సుప్రీంకోర్ట్ లో జ్ఞానవాపీ విచారణ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా జ్ఞానవాపీ మసీదు వ్యవహారం మారింది. రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం కావడంతో సుప్రీం కోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే సుప్రీం కోర్ట్ ఈ వ్యవహారాన్ని వారణాసిజిల్లా కోర్ట్ లోనే విచారించాలనే నిర్ణయంపై మొగ్గు చూపింది. జిల్లా జడ్జీ ఈ విచారణను చేపడితే బాగుంటుందని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. సీనియర్, అనుభవం ఉన్న జడ్జీ ఈ కేసును విచారిస్తారని సుప్రీం కోర్ట్…
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో తాజాగా చేపట్టిన సర్వేలో శివలింగం బయటపడడం పెద్ద చర్చగా మారింది.. వారణాసి కోర్టు మసీదు మొత్తాన్ని వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 14-16 వరకు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇదిలా ఉంటే మసీదులో ఉన్న బావితో శివలింగం బయటపడింది.. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.. ఇక, ఈ కేసులో వారణాసి కోర్టు విచారణ ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. జ్ఞానవాపి మసీదు కేసును శుక్రవారం…
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్టు మసీదు మొత్తాన్ని వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 14-16 వరకు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇదిలా ఉంటే మసీదులో ఉన్న బావితో శివలింగం బయటపడిందని తెలుస్తోంది. నిజానికి సర్వే రిపోర్టును ఈ నెల 17న వారణాసి కోర్టుకు అందించాలి… అయితే మసీదులోని వాజుఖానా బావిలో శివలింగ ఆకారం బయటపడటంతో సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మరో రెండు రోజులు గడువు…
దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు వీడియో గ్రఫీ సర్వేపై స్టే ఇవ్వాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. మరోవైపు స్టే విధించాలని వేసిన పిటిషన్ కు వ్యతిరేఖంగా హిందూ సేన మరో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలను జారీ చేసింది. వారణాసి కోర్ట్ లో మొదటి…
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదుపై రచ్చ నడుస్తోంది. వారణాసి కోర్ట్ మసీదు వీడియోగ్రఫీకి అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది. ఓ వర్గం వారు కోర్ట్ ఆదేశాలను వ్యతిరేఖిస్తున్నారు. మసీదు మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసి ఈనెల 17న రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోర్ట్ కమిషనర్ ను ఆదేశింది. మసీదు వెలపల గోడపై హిందూ దేవత విగ్రహాలు ఉన్నాయని.. మాకు పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించడంతో కోర్ట్ వీడియోగ్రఫీకి ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా…
దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదంపై చర్చ జరుగుతోంది. వారణాసి కోర్ట్ దేశాలతో ఈ రోజు కోర్ట్ కమిషనర్ టీం జ్ఞానవాపి మసీదును వీడియోగ్రఫీ చేయనున్నారు. దీంతో వారణాసి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మసీదుకు చుట్టూ 500 మీటర్ల వరకు ఉన్న అన్ని దుకాణాలను మూసివేయబడ్డాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట భద్రతా…
ఉత్తర ప్రదేశ్ లో ఆఖరి, చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి విడతలో 9 జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. మొత్తం 613 అభ్యర్థులు పోటీలో వున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆఖరి విడతలో బీజేపీ, ఎస్పీ భాగస్వామ్య పక్షాల మధ్య పోటీ వుంటుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 54 స్థానాల్లో 29 స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తర్ ప్రదేశ్…
సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో విద్యను బోధిస్తుంటారు. వివిధ వృత్తులపై శిక్షణ ఇస్తుంటారు. అయితే, వారణాసిలోని హిందూ బనారస్ విశ్వవిద్యాలయంలో పిడకలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. సోషల్ సైన్స్ అండ్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కౌశిల్ విద్యార్థులకు పిడకలు చేయడంపై శిక్షణ అందించారు. విశ్వవిద్యాలయంలోని సమీకృత గ్రామాభివృద్ది కేంద్రంలో విద్యార్థులకు శిక్షణ అందించారు. కేవలం వంట చేసుకోవడానికి మాత్రమే కాకుండా యజ్ఞయాగాదుల్లోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ పిడకలను వినియోగిస్తారు. ఒకప్పుడు గ్రామాల్లో పిడకలను ప్రతి ఇంట్లో వినియోగించేవారు. కానీ, ఇప్పుడు కొన్ని…