2024లో వచ్చేది జనసేన - టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ లాగా డబ్బు పేరుకుపోయి ఉన్న నేతను ఎలా అడ్డుకోవాలో తనకు తెలుసన్నారు. తమకు నైతికంగా బలం ఉంది కాబట్టే.. నేనింత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే వాడిని అయ్యామన్నారు. తాను ప్యాకేజ్ తీసుకున్నానని ఆరోపిస్తున్నారని.. తనకు డబ్బంటే ప్రేమ లేదని వాళ్లకెలా చెప్పనంటూ పేర్కొన్నారు.
ఈ సారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. జగన్ ఓటమి ఖాయమని, మేం అధికారంలోకి రావడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.
వారాహి యాత్ర కోసం పడిన కష్టం వృథా కాదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర వేస్తుందన్నారు. ప్రజాకంటక పాలనకు విముక్తి గోదావరి జిల్లాల నుంచే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్