Varahi Vijaya Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు విడతలుగా నిర్వహించిన వారాహి విజయయాత్రను విజయవంతం అయ్యింది. దీంతో, మూడో దశకు సిద్ధం అవుతోంది జనసేన పార్టీ.. మూడో విడత వారాహి యాత్ర ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నిర్వహించనున్నారు.. యాత్ర విజయవంతంపై ఈ రోజు విశాఖ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖ సిటీ నుంచి మొదలవుతుంది. ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
Read Also: CM KCR: టీఎన్జీఓలు, టీజీఓల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగింది. అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలన్నారు. నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు నాదెండ్ల.. యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం విశాఖలో ఉంటుంది. అదే. విధంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో పవన్ కల్యాణ్ సమావేశమై సమస్యలను తెలుసుకుంటారని వెల్లడించారు. ఇక, ఈ సమావేశంలో జనసేన నేతలు కోన తాతారావు, టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, సుందరపు విజయకుమార్, పరుచూరి భాస్కర రావు, గడసాల అప్పారావు, అంగ దుర్గా ప్రశాంతి, బోడపాటి శివదత్, పి.ఉషాకిరణ్, పంచకర్ల సందీప్, పీవీఎస్‌ఎన్ రాజు, వంపూరు గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.