విశాఖపట్నంలో వారాహి విజయ యాత్రపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. విశాఖకు చెందిన పార్టీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు.
వారాహి విజయ యాత్ర షెడ్యూల్:
1. ఈ రోజు (11/08/2023) మధ్యాహ్నం భీమిలి నియోజకవర్గంలోని రుషికొండను సందర్శిస్తారు.
2. 12వ తేదీ(శనివారం): ఉదయం 11 గంటలకు పెందుర్తి నియోజకవర్గానికి వెళ్తారు. వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శ.. సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సి.ఎన్.బి.సి. ల్యాండ్స్ ప్రాంతాన్ని సందర్శిస్తారు.
3. 13వ తేదీ(ఆదివారం) : వారాహి విజయ యాత్రలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
Read Also: Shree Rapaka : పెళ్లికి ముందే ఆ పని చెయ్యాలి అంటూ బోల్డ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ.
4. 14వ తేదీ(సోమవారం) ఉదయం: 11 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని విస్సన్నపేటకు వెళ్తారు. అక్కడ ఆక్రమణకు గురైన భూములను సందర్శిస్తారు.
5. 15వ తేదీ(మంగళవారం) మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
6. 16వ తేదీ(బుధవారం) : విశాఖ నగరం భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బలను సందర్శిస్తారు.
7. 17వ తేదీ (గురువారం) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు.
Read Also: New Covid19 Variant: అమెరికాలో కలకలం రేపుతున్న కరోనా కొత్త వేరియంట్
అయితే, పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పవన్ రుషికొండకు వెళ్లే అవకాశం ఉంది. ఋషికొండ రక్షిత ప్రదేశం కానీ నిషేధిత జాబితాలో లేదు అని జనసేన నేతలు అంటున్నారు. అక్కడకు వెళ్ళడానికి ఎవరి అనుమతి అవసరం లేదు అని తెలిపారు. బాధ్యతగల రాజకీయ పార్టీగా రుషికొండ వెళ్లడం పవన్ కు హక్కు ఉందని పేర్కొంటున్నారు. అడ్డు కోవడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయని పోలీసులను జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు. పవన్ పర్యటనకు రెవెన్యూ, పోలీస్ యంత్రంగం సహాకరించాలి అని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్తానంటే ఆంక్షలు పెట్టడం హక్కులను ఉల్లంఘించడమేనని వారు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, పర్యావరణ ధ్వసం ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు అని జనసేన నేతలు అంటున్నారు.