విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులు మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్‌ను ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. విశాఖలో రోడ్డు యాక్సిడెంట్ బాధితుల సహకార కేంద్రం ప్రారంభించామన్నారు.
సీఎం జగన్ పాలనపై విపక్ష నేతలు మండిపడుతూనే వున్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పోలీస్ యూనిఫాం కోసం మహిళా పోలీసులకు జంట్స్ టైలర్ తో కొలతలు తీయించడం దారుణం అన్నారామె. యూనిఫాం కుట్టేందుకు లేడీ టైలర్స్ లేరా? వైసీపీ పాలనలో మహిళలకే కాదు.. మహిళా పోలీసులకూ రక్షణ కరువైంని అనిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ వల్లే మహిళలకు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయన్నారు.…
వైసీపీ ప్రభుత్వంపైన, సీఎం జగన్ పైన టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మహిళా ద్రోహి అంతో వంగలపూడి వనిత ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ళుగా సీఎంలో మార్పు వస్తుందని ఆశించామని ఆమె అన్నారు. పాదయాత్ర లో ముద్దులు పెట్టిన సీఎం జగన్ నేడు గుద్దులు గుద్దుతున్నారని ఆమె వ్యంగ్యంగా మాట్లాడారు. మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతూ మహిళల మెడలోని పుస్తెలు తెంచుతున్నారని, ప్రతి రోజు మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు.…
మహిళలపై అత్యాచారాలలో ఏపీ రెండవ స్థానంలో ఉందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ సందర్భంగా గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత చెల్లికి రక్షణ ఇవ్వలేని వ్యక్తి సీఎం జగన్ అని, ఇక రాష్ట్ర మహిళలకు ఏం ఇస్తాడు అంటూ విమర్శించారు. రాష్ట్రంలో నేరగాళ్లకు ప్రెంఢ్లీ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని దుయ్యబట్టారు. ఏపీలో మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారని ఆమె అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అత్యాచారం చెయ్యాలంటే భయపడే పరిస్థితి చంద్రబాబు కల్పించారన్నారు.…
గుడివాడ క్యాసినో ఘటన రోజురోజుకు ముదురుతోంది. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ పేరు చేబితే మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్ గుర్తుకు వచ్చేవని.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పెరు చెబితే గుడివాడ , అందులో క్యాసినో గుర్తుకొస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు సూపర్ సీఎం జగన్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కానీ కొడాలి నాని గారు మాత్రం కరోనా తో హైదరాబాద్లో…
నక్కపల్లి మండలంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంయత్నం కేసు విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రంగా విరుచుకు పడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఉంటే ఎంత ? లేకపోతే ఎంత? అని ఆమె మండిపడ్డారు. ఆడపిల్లల తల్లితండ్రుల ఆవేదన ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్మోహన్ రెడ్డి కి తెలియదా అని…
మత్తులో జరిగే హత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. మద్యపానం నియంత్రణ కోసం రెండున్నరేళ్లలో ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైన్ షాపుల్లో దొరుకుతున్న చీప్ లిక్కర్‌ను తాగి రెండేళ్లుగా ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నారన్నారు. మూడు దశల్లో మద్యపాన నియంత్రణ చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఎందుకు మడమ…
అమరావతి : వైసీపీ నేతలపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పినట్లు మేం భావించడం లేదని… చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యల విషయంలో వంశీ క్షమాపణలు నమ్మలేమని మండిపడ్డారు. మాకు వంశీ సారీ కాదు.. చంద్రబాబు కన్నీళ్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వంశీ ఇటు సారీ అంటారు.. కొడాలి మళ్ళీ మీదే తప్పు అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు వంగలపూడి అనిత. వంశీ 5 శాతమే తప్పు చేశారని కొడాలి అనడాన్ని…
అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏపీ అసెంబ్లీని భూతుపురాణంగా మార్చేశారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. కేటుగాళ్లందరూ అసెంబ్లీలో కూర్చున్నారని.. వైసీపీ నేతలు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. సీఎం జగన్ తల్లి, చెల్లి కూడా ఓ మహిళే అని గుర్తుపెట్టుకోవాలన్నారు. మాజీ సీఎం భార్యపై ఇష్టానుసారంగా మాట్లాడితే పోలీసులు చర్యలు తీసుకోరా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. Read Also: చంద్రబాబు గ్లిజరిన్…
శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న మహిళా రైతుల్ని రెచ్చగొట్టడం సరికాదని, పాదయాత్రకి అడ్డంకులు సృష్టించడం సబబు కాదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. కడుపు మండి ధర్నా చేసే మహిళా రైతుల మాటలను వక్రీకరిస్తూ మాట్లాడటమేంటని ఆమె మండిపడ్డారు. ధర్నా చేస్తున్న మహిళా రైతుల్ని బూటు కాళ్లతో తన్నించడం ఎంత వరకు సమంజసం వైసీపీ నాయకు లను ఆమె నిలదీశారు. రాజధాని రైతులను దుర్భాషలాడితే సహిం చేది లేదని హెచ్చరించారు. నిరసన తెలియజేసినవారికి మద్దతు…