Vande Bharat: తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఇటీవల ప్రయాణికులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను ఆశ్రయిస్తున్నారు. మెరుగైన సౌకర్యాలతో కూడిన ఈ ట్రైన్లలో ఫుడ్ మాత్రం అంత నాణ్యతగా ఉండటం లేదు. గతంలో పలువురు ప్రయాణికులు ఆహారం విషయమై ఫిర్యాదులు చేశారు. తాజాగా ఆకాశ్ కేసరి అనే ప్రయాణికుడికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రైలులో ఇచ్చిన భోజనం దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తుండగా ఈ అనుభవం ఎదురైంది.