Vande Bharat: వందేభారత్ ఆహారంలో దుర్వాసన.. ప్రయాణికుడి పోస్టుకు స్పందించిన రైల్వేశాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat: తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఇటీవల ప్రయాణికులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను ఆశ్రయిస్తున్నారు. మెరుగైన సౌకర్యాలతో కూడిన ఈ ట్రైన్లలో ఫుడ్ మాత్రం అంత నాణ్యతగా ఉండటం లేదు. గతంలో పలువురు ప్రయాణికులు ఆహారం విషయమై ఫిర్యాదులు చేశారు. తాజాగా ఆకాశ్ కేసరి అనే ప్రయాణికుడికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రైలులో ఇచ్చిన భోజనం దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తుండగా ఈ అనుభవం ఎదురైంది.
Read Also: Covid Cases : దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. గడిచిన 24 గంటల్లో 514 కేసులు..
Also Read
దీనిపై ఆగ్రహంగా ఉన్న ఆకాశ్ కేసరి ఎక్స్(ట్విట్టర్)లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హాయ్ సార్ నాకు అందించిన ఆహారం దుర్వాసనతో పాటు చాలా మురికిగా ఉంది. దయచేసి నా డబ్బునున తిరిగి ఇవ్వండి.. ఈ ఆహార విక్రేతలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ పేరును పాడు చేస్తున్నారు’’ అంటూ ఫుడ్‌కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇండియన్ రైల్వే, వందేభారత్ ఎక్స్‌ప్రెస్, రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్‌ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
దీనిపై భారత రైల్వే స్పందించింది. రైల్ మదద్‌లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయబడిందని, ఫిర్యాదు నంబర్ మీ మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ ద్వారా పంపించబడిందని, తదుపరి సాయం కోసం డైరెక్ట్ మెసేజ్(డీఎం) ద్వారా పీఎన్ఆర్, మొబైల్ నెంబర్ పంచుకోవాలని ప్రయాణికుడిని కోరింది. దీనిపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) స్పందిస్తూ.. అసౌకర్యానికి చింతిస్తున్నామని, సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
@indianrailway__ @AshwiniVaishnaw @VandeBharatExp Hi sir I am in journey with 22416 from NDLS to BSB. Food that was served now is smelling and very dirty food quality. Kindly refund my all the money.. These vendor are spoiling the brand name of Vande Bharat express . pic.twitter.com/QFPWYIkk2k
— Akash Keshari (@akash24188) January 6, 2024
Sir, our sincere apologies for the unsatisfactory experience you had. The matter is viewed seriously. A suitable penalty has been imposed on the service provider. Further the service provider staff responsible have been disengaged and the licensee has been suitably instructed.…
— IRCTC (@IRCTCofficial) January 11, 2024
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!