Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెమీహైస్పీడ్ రైలు. ఇప్పటికే 14 రూట్లలో వందేభారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లే విధంగా ఈ రైళ్లను తయారు చేశారు. అయితే ఇండియాలో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్స్ అంతవేగాన్ని తట్టుకునే అవకాశం లేకపోవడంతో 130 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు.
Vande Bharat Express: భారతదేశంలో సెమీ హైస్పీడ్ రైల్ గా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇప్పటికే దేశంలో వివిధ మార్గాల్లో వందేభారత్ ట్రైన్ పరుగులు తీస్తున్నాయి. తాజాగా శనివారం రోజు భోపాల్-న్యూఢిల్లీ మధ్య మరో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దీంతో కలిపి దేశవ్యాప్తంగా 11 వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ ఏప్రిల్ నెలలో మరో 4 రూట్లలో ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.