సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం లోతైన లోయలో పడటంతో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. ఆర్మీ వాహనం కఠినమైన పర్వత మార్గంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుంచి సిక్కింలోని జులుక్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
జమ్మూ కాశ్మీర్ లేహ్‌లోని దుర్గుక్ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరో 19 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఒడిశాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కెలాలోని హేమ్‌గిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్తాలీ వ్యాలీలో ప్రమాదవశాత్తు బొలెరో వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కార్మికులు అక్కడికక్కడే మరణించారు.. వాహనం డ్రైవర్ సహా మరో ఏడుగురికి గాయలయ్యాయి. ఉదయం కూలీలు పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కూనూర్‌లోని మరపాలెం సమీపంలో టూరిస్ట్ బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 35 మందికి గాయాలయ్యాయి. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బస్సులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందినట్లుగా సమాచారం తెలుస్తోంది. సుమారు 15 మంది వరకు తీవ్ర గాయాలు అయ్యాయి.