ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరో కొత్త ప్రేయసిని పరిచయం చేశారు. గతంలో మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ను పరిచయం చేశారు. ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్నారు.
వాలెంటైన్స్ డే రోజున ఒక డేట్‌కి వెళ్లాలనే ఆలోచన గురించి ఆలోచిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ ఈ రోజున, దాదాపు ప్రతి చోటా విపరీతమైన రద్దీగా ఉంటుంది. అక్కడ ఎవరైనా తిరుగుతూ, తీరికగా కూర్చుని మాట్లాడుకోలేరు. చాలా సార్లు రెస్టారెంట్లు మొదలైన వాటిలో కూర్చోవాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపాలనే ఆలోచన పాడవుతుంది.
Valentine Day: వాలెంటైన్ డేని ప్రేమికులు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్‌లోని కాంత్రి సేన మాత్రం ‘లాఠీ పూజ’ని నిర్వహించింది. లాఠీలకు నూనె రాసి పూజ చేస్తున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రేమికులు దినోత్సవం ముసుగులో అమ్మాయిలపై దురుసుగా ప్రవర్తించే, ఆటపట్టించే వ్యక్తులకు, లవ్ జిహాద్ వ్యాప్తి చేసే వ్యక్తులకు లాఠీలతో గుణపాఠం చెబుతామని క్రాంతి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ సైనీ శనివారం వార్నింగ్ ఇచ్చారు.
ప్రేమ ఒక మాయ. మనిషి తన జీవితంలో ఏ దశలోనైనా ఈ అనుభూతిని తప్పకుండా పొందేఉంటాడు. అది కొందరికి అమృతాన్ని ఇస్తే మరికొందరికి దుఃఖాన్ని మిగుల్చుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమ నిప్పులాంటిది. తేడా వస్తే, అది మిమ్మల్ని .. మీవాళ్లను సైతం దహనం చేస్తుంది. అందుకే మనసుతో ఆడుకోవడం నిప్పుతో ఆడుకున్నంత ప్రమాదకరం. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన కళ్లకు అన్నీ అందంగానే కనిపిస్తాయి.