Love or Attraction: ప్రేమ ఒక మాయ. మనిషి తన జీవితంలో ఏ దశలోనైనా ఈ అనుభూతిని తప్పకుండా పొందేఉంటాడు. అది కొందరికి అమృతాన్ని ఇస్తే మరికొందరికి దుఃఖాన్ని మిగుల్చుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమ నిప్పులాంటిది. తేడా వస్తే, అది మిమ్మల్ని .. మీవాళ్లను సైతం దహనం చేస్తుంది. అందుకే మనసుతో ఆడుకోవడం నిప్పుతో ఆడుకున్నంత ప్రమాదకరం. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన కళ్లకు అన్నీ అందంగానే కనిపిస్తాయి. కానీ ఎక్కడైనా చిన్న పొరపాటు చేసినప్పుడే ఎక్కడ పడిపోయామో లోతెంతో తెలుస్తుంది. అందుకే మీ మనస్సుతో పాటు మీ మనస్సులోకి వచ్చే వ్యక్తి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. ముఖం చూడగానే ప్రేమ పుడుతుంది కానీ ఎదుటి వ్యక్తిని ఎలా చెప్పగలం అనే ప్రశ్న రావచ్చు. మొహం చూసి ప్రేమలో పడి గుడ్డిగా ముందుకు సాగలేరు. ఏది కావాలో అన్నీ చూసుకుంటాం.. జీవితాంతం ఎవరితో గడపాల్సిన వారిని ఎంపిక చేసుకోవడంలో పొరపాటు చేస్తే ఫలితం మనతో పాటు మనవాళ్లు జీవితాలు. అందుకే మీ ప్రేమ, ఆకర్షణ అనేది పక్కాగా తెలుసుకోండి. ముందుగా మీ ప్రేమ ఎలా మొదలైందో గుర్తు చేసుకోండి. మీ ప్రయాణంలో ప్రతి మలుపు.. మీరు, మీ భాగస్వామి పరిస్థితిపై స్పందించిన విధానం.. తీసుకున్న నిర్ణయాలను పరిశీలించండి.
Read also: CM KCR: కేసీఆర్ కొండగట్టు పర్యటన రేపటికి వాయిదా.. షెడ్యూల్ ఇదే..
చాలా మంది తమ స్నేహితుల ముందు తమ మనసును ఖచ్చితంగా బయటపెడతారు. ఏదో ఒక సమయంలో మీ ప్రస్తావన కూడా వచ్చే ఉంటుంది. అలాంటి సందర్భాలలో మీ గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవడం మంచిది. వారు చెప్పేది గుడ్డిగా నమ్మడం కూడా చాలా ప్రమాదకరం. మనం ప్రేమలో పడినప్పుడు, మన భాగస్వామి మనతో మాట్లాడటానికి, సమయం గడపడానికి ఆలోచిస్తుంటారు. కానీ రోజులు గడిచేకొద్దీ, ఆ సంబంధంలో ఏవైనా మార్పులను గమనించండి. లోపాలు, మితిమీరిన అబద్ధాల చెప్పడం లాంటివి జరుగుతున్నాయోమో గమనించండి. మనం ప్రేమలో ఉన్నప్పుడు, మన భాగస్వామికి కొంత అసౌకర్యం లేదా కోపాన్ని కలిగించినప్పటికీ, మేము వాగ్దానం చేస్తుంటాము. ఇలాంటి సందర్భాల్లో మీకు ఎలాంటి వాగ్దానాలు చేస్తున్నారు? అవి నిజమవుతాయో లేదో ఆలోచించండి. ఎందుకంటే మాటలతో భవనాలు కట్టవచ్చు.. కానీ నిజజీవితంలో చెప్పేది నిజం కాదు. మానవ జీవితంలో అబద్ధం చెప్పలేని వారుండరు. ప్రధానంగా ప్రేమలో ఉన్నవారు చాలా సందర్భాలలో వాటిని ఉపయోగిస్తారు.కానీ అబద్ధంతో మీ సంబంధాన్ని నాశనం చేయనివ్వవద్దు. మీరు చెప్పేది అబద్ధమని ఎదుటి వ్యక్తికి తెలిసినప్పుడు మీ సంబంధం కొనసాగదు. కత్తి కంటే మాట చాలా పదునైనది. అలాంటి ఆకర్షణలో ఇలాంటి అబద్ధాలకు కొదవే ఉండదు. మీరు ఇతరులను మాటలతోనే అంచనా వేయవచ్చు.
Read also: Waltair Veerayya: బాసు గ్రేసుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే…
ఇక పెళ్లి విషయంలోనూ ఇదే తప్పు చేస్తుంటారు కొందరు. మీరు ప్రేమిస్తున్నామంటే ఎదుటి వారిని గుడ్డిగా నమ్మకండి. అవతలి వ్యక్తి కుటుంబం, వ్యక్తిగత వివరాలు పూర్తిగా తెలియాలి. ఏదో సోషల్ మీడియాలో పరిచయం చూడటానికి బాగానే ఉంటుందనుకుంటూ ముందుకు సాగితే బొక్కబోర్లా పడిపోవడం ఖాయం. ఏదైనా ప్రమాదం లేదా సమస్య సంభవించినప్పుడు మీ పట్ల వారి ప్రవర్తనను అంచనా వేయండి. అతను మీతో ఉంటాడో లేదా అతను పక్కకు వెళ్లి మిమ్మల్ని దానిలోకి నెట్టివేస్తాడో గమనించండి. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు, వారు సమస్యను ఎలా ఎదుర్కొంటున్నారో చూడండి.మీరు ఒంటరిగా ఉన్నప్పుడల్లా, అవతలి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో మాట్లాడతాడో గమనించండి. ఆకర్షితులైన చాలా మంది ఈ పరిస్థితిలో బయటపడతారు.మీ ప్రియమైన వారి ఆహారపు అలవాట్లు, ఆర్థిక విషయాలలో వారి ప్రవర్తనను పరిశీలించండి. ఎందుకంటే ప్రేమ అనేది కాసేపు నిలిచిపోయే సీజన్ లాంటిది కాదు.. ఇతరుల జీవితంలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవడం తప్పు కాదు.. కాబట్టి మీ సంబంధం డబ్బు చుట్టూ తిరగకూడదు.. అలాంటి వారి మధ్య ప్రేమ ఉండదు. మా స్నేహితులకు ప్రేమికులు ఉన్నారు. మనకి లేరనో.. బైక్పై జంటగా తిరిగితే ఆ మజాయే వేరనో.. లేదంటే సినిమాల్లో చూసినట్టు మనం కూడా ఉండాలనో.. లేదంటే ఏదొక రాయి వేద్దాం.. పడితే కొన్నాళ్లు ఎంజాయ్ చేద్దాం.. అన్నీ కుదిరితే పెళ్లి చేసుకోవచ్చు. లేదంటే బ్రేకప్ చెప్పేద్దామనో, అలాంటి ఆలోచనలు ఉంటే ఆపేయండి.. ఎందుకంటే ప్రేమ అనేది మనసుకు సంబంధించినది.ఇతరులు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తే, వారు తమ ప్రాణాలను కోల్పోతారు. అందుకే మనసుతో ఆడుకోకూడదు. ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే రేపు వచ్చే పరిస్థితులకు నువ్వే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
America: గగనతలంలో గుర్తుతెలియని వస్తువులపై అమెరికా క్లారిటీ!