Woman Catches Daughter Red-Handed With Boyfriend On Valentine Day: ఫిబ్రవరి 14.. ప్రేమికులకు ఇది ఒక ప్రత్యేక దినం. ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రేమికులు.. ఈ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తమ మధ్య విభేదాలుంటే ఆరోజు వాటిని దూరం చేసుకొని ప్రేమగా సమయం గడపడం లాంటివో, జీవితాంతం కలిసి ఉండాలని ప్రతిజ్ఞతలు చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. ఎలాంటి పరిస్థితులున్నా, ఎన్ని అడ్డంకులున్నా.. వాటిని దాటుకొని, ఆరోజు తమ ప్రియుడు/ప్రియురాలితో సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా జంటలకు ఈ ప్రయత్నాలు ఫలించి ఉండొచ్చు గానీ, కొందరి విషయంలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. మనం చెప్పుకోయే జంటకు అలాంటిదే ఓ పరాభావం ఎదురైంది. కచ్ఛితంగా ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందన్న వివరాలు తెలీదు కానీ.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పదండి.. ఆ వివరాల్లేంటో తెలుసుకుందాం..
IND vs AUS: రెండో టెస్టులో భారత్ ఘనవిజయం.. సత్తా చాటిన స్పిన్నర్లు
ప్రేమికుల రోజు నాడు ఓ జంట హోటల్‌లో సరదాగా సమయం గడిపేందుకు వచ్చింది. హోటల్‌లో కూర్చొని, ఇద్దరు తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేశారు. అనంతరం ప్రేమ మాటల్లో మునిగితేలారు. ఇంతలో.. వెనుక నుండి అమ్మాయి తల్లి మెల్లగా వచ్చింది. తల్లికి ఎవరు సమాచారం ఇచ్చారో తెలీదు కానీ, తన కూతురిని మరో అబ్బాయితో చూసేసరికి ఆమె కోసం నషాళానికి ఎక్కింది. ఇంకేముంది.. వెంటనే ‘యూనివర్సల్ ఆయుధం’ (చెప్పు) తీసి.. కూతురు సహా ఆ యువకుడ్ని బడితపూజ చేసింది. ‘‘బుద్ధిగా ఉండమని చెప్తే, బయట నువ్వు చేస్తోంది ఈ పాడు పనా’’ అంటూ చెప్తూ చితకబాదింది. తన తల్లిని ఆపేందుకు కూతురు ప్రయత్నించింది కానీ, తల్లి కొడుతున్న దెబ్బల ధాటికి తట్టుకోలేక బోరుమంది. అటు అబ్బాయి కూడా కొట్టొద్దు అని వేడుకున్నా.. తల్లి మాత్రం ఆగలేదు. ఏకే 47 నుంచి బుల్లెట్లు ఎలా కురుస్తాయో, అలా టపీటపీమంటూ ఒకటే వాయింపుడు వాయించేసింది. ఈ వీడియోని అర్జూ కజ్మీ అనే నెటిజన్ షేర్ చేయగా.. ఇది వెంటనే వైరల్ అయ్యింది.
KTR tweet: అదానీ కోసం బయ్యారం బలి.. ముంద్రా దగ్గరా?
Kalesh B/w Couples and Girl’s Mom on Valentine’s Daypic.twitter.com/01Oia07RRt
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 15, 2023