కేరళలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ 20 వేలకు పైగా కేసులు బయటపడుతుండటంతో ఆ రాష్ట్రం కట్టడికి కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇక, దేశంలో ఎలాంటి విపత్తులు కలిగినా వెంటనే స్పందించే రిలయన్స్ సంస్థ మరోమారు ముందుకు వచ్చి కేరళకు సహాయాన్ని అందించింది. కేరళ రాష్ట్రానికి 2.5 లక్షల కోవీషీల్డ్ టీకాలను ప్రభుత్వానికి అందజేసింది. కరోనా కట్టడికి చేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రిలయన్స్ అందించిన వ్యాక్సినేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్…
దేశంలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. తీవ్రత పెరుగుతుండటంతో ఒకే వ్యాక్సిన్ రెండు డోసుల కంటే మిశ్రమ వ్యాక్సిన్ విధానం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే అంశంపై ఐసీఎంఆర్ పరిశోధన నిర్వహించింది. ఒక డోసు కోవీషీల్డ్, మరో డోసు కోవాగ్జిన్ టీకాలు పొందిన వారికి, రెండు డోసులూ ఒకే రకం వ్యాక్సిన్ తీసుకున్న వారికన్నా మెరుగైన రోగనిరోధక రక్షణ లభిస్తోందని తేలింది. ఉత్తర…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధంగా మారింది. ప్రపంచంలో ఇప్పటికే పలురకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అభివృద్ది చెందిన దేశాల్లో వ్యాక్సిన్ కొరత లేకున్నా, టీకాలు తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అనేక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు వివిధ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ వ్యాక్సినేషన్ మందకోడిగా సాగుతున్నది. అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గినట్టే తగ్గి, తిరిగి పెరుగుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో 50 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతి రోజూ 50 లక్షలకు పైగా టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న టీకారు రెండు డోసుల టీకాలు. రెండు డోసులు తప్పని సరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇదిలా ఉంటే, జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్…
కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రపంచంలోని చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ధనిక దేశాల్లో వ్యాక్సిన్ కొరత లేనప్పటికీ కొన్ని చోట్ల వేగంగా సాగడంలేదు. జులై 4 వరకు అమెరికాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ లక్ష్యం నెరవేరలేదు. 2020 డిసెంబర్ 14 వ తేదీన అమెరికాలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో వేగంగా కొనసాగినా మధ్యలో కొంతమేర మందగించింది. దీంతో అధ్యక్షుడు జో బైడెన్…
కరోనా టీకా పంపిణీలో భారత్ దూసుకుపోతుంది. మిగతా దేశాల కంటే స్పీడ్‌గా టీకా పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 50 కోట్ల డోసులను అందించినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇంతే వేగంగా కొనసాగాలని చెప్పారు. ఇది అనేక మందికి ప్రేరణ అని అన్నారు. అటు ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కూడా స్పందించారు. ఆరోగ్య శాఖ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. జనవరి 16న దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచ దేశాలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. అన్ని దేశాల్లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. అయితే, అభివృద్ది చెందిన దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అక్కడి ప్రభుత్వాలు వ్యాక్సిన్ తీసుకునే వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. బ్రిటన్‌లో ఇప్పుడు ఇదే చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి షాపింగ్ వోచర్లు, పిజ్జా డిస్కౌంట్‌లు, ప్రయాణాల్లో రాయితీల పేరుతో వ్యాక్సిన్ వోచర్లను…
కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నా తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా నిబంధనలు పాటించాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. దేశంలో సూపర్ స్ప్రైడర్‌లుగా మారే కార్యక్రమాలను నియంత్రించాలని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కార్య క్రమాలను నిర్వహిస్తే వాటి ప్రభావం మూడు వారాల తరువాత కనిపిస్తుందని, అత్యవసరమైతే తప్పించి ప్రయాణాలు చేయవద్దని, మహమ్మారిని ఎదుర్కొవాలంటే తప్పని సరిగా నిబంధనలు పాటించి తీరాలని ఆయన…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తున్నది. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, వేగంగా వ్యాక్సిన్‌ను అమలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కూడా కరోనా సోకుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో టీకాలను మిక్స్ చేస్తే ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది అనే విషయంపై టీకా కంపెనీలు, శాస్త్రవేత్తలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఆస్త్రాజెనకా టీకాతో రష్యా స్పుత్నిక్ వి లైట్ టీకాను కలిపి ఇస్తే ఎలా…