కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రపంచంలోని చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ధనిక దేశాల్లో వ్యాక్సిన్ కొరత లేనప్పటికీ కొన్ని చోట్ల వేగంగా సాగడంలేదు. జులై 4 వరకు అమెరికాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ లక్ష్యం నెరవేరలేదు. 2020 డిసెంబర్ 14 వ తేదీన అమెరికాలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో వేగంగా కొనసాగినా మధ్యలో కొంతమేర మందగించింది. దీంతో అధ్యక్షుడు జో బైడెన్ నిర్ధేశించిన 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ జులై 4 వరకు పూర్తికాలేదు. అమెరికాలో సగం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి 33 వారాల సమయం పట్టినట్టు వ్యాక్సినేషన్ సమాచార విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సైరస్ షాపర్ ప్రకటించారు. ఇప్పటి వరకు 165 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ అందించినట్టు ఆయన తెలిపారు.