కేరళలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ 20 వేలకు పైగా కేసులు బయటపడుతుండటంతో ఆ రాష్ట్రం కట్టడికి కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇక, దేశంలో ఎలాంటి విపత్తులు కలిగినా వెంటనే స్పందించే రిలయన్స్ సంస్థ మరోమారు ముందుకు వచ్చి కేరళకు సహాయాన్ని అందించింది. కేరళ రాష్ట్రానికి 2.5 లక్షల కోవీషీల్డ్ టీకాలను ప్రభుత్వానికి అందజేసింది. కరోనా కట్టడికి చేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రిలయన్స్ అందించిన వ్యాక్సినేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. గతంలో కేరళలో వరదలు సంభవించిన సమయంలో రిలయన్స్ సంస్థ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.21 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.