Hathras Stampede: ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భోలే బాబాగా చెప్పబడుతున్న వ్యక్తి ధార్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ఏకంగా 121 మంది మరణించారు.
హత్రాస్ తొక్కిసలాట ఘటనను హిందూ-ముస్లిం సమస్యగా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని, ముఖ్యమంత్రి ఉద్దేశం తప్పు అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి పేర్కొన్నారు. మంగళవారం హత్రాస్‌లో సత్సంగం (మత సమ్మేళనం) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని పారా ప్రాంతంలోని రెండంతస్తుల ఇంట్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని రూపం చాలా భయంకరంగా ఉంది. కొద్దిసేపటికే అంతా కాలిపోయింది.
ఇళ్లకు కన్నాలేసే దొంగలు చాలా అలర్ట్‌గా ఉంటారు. రాత్రి పూట అందరూ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎవరికీ డౌట్ రాకుండా దోచుకుని వెళ్లిపోతుంటారు. రాత్రి దొంగతనం చేసే దొంగ నిద్రకు కక్కుర్తి పడితే అడ్డంగా దొరికిపోక తప్పదు. నిద్రలోకి జారకుని ఇంట్లో వాళ్లకు దొరికాడంటే ఆ దొంగ పని అంతే ఇంక. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సరిగ్గా ఇదే జరిగింది.
ధనవంతులు.. లేదంటే వీఐపీలు తమ ఇళ్లల్లో ఖరీదైన కుక్కలు పెంచుకుంటారు. అంతేకాకుండా వాటిని చూసుకునేందుకు కేర్‌టేకర్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు బయటకు తీసుకుని వెళ్లినప్పుడు హఠాత్తుగా దాడులకు తెగబడుతుంటాయి.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ షాపింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ దృశ్యాలు రోడ్డుపై అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి.
యూపీలో గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్ నుంచి ఒక మహిళ మృతదేహాన్ని సోమవారం వెలికితీయడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఓ కానిస్టేబుల్ ప్రభుత్వ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ముందే భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మరణ వార్త తెలిసిన వెంటనే కొన్ని గంటల తర్వాత రైఫిల్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.
యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ అన్న.. ఇద్దరు చెల్లెల్లు మృతి చెందారు. మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదం.. గ్రేటర్ నోయిడాలోని ప్యారీ చౌక్ సమీపంలో జరిగింది. నలుగురు కలిసి బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. వీరంతా.. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై…