UP: షాపింగ్ ముగించుకుని ఇంటికి వస్తున్న మహిళపై అత్యాచారానికి యత్నం.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ షాపింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ దృశ్యాలు రోడ్డుపై అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు హడావుడిగా కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించారు. సమాచారం ప్రకారం.. ఈ సంఘటన మంగళవారం రాత్రి రావత్‌పూర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ఒక మహిళ షాపింగ్ తర్వాత సాల్ట్ ఫ్యాక్టరీ కూడలికి చేరుకుంది. ఆ సమయంలో రోడ్డుపై ఎవ్వరూ లేరు. మహిళను ఒంటరిగా ఉండటం గమనించిన ఓ యువకుడు మార్గంమధ్యలో ఆమెను కింద పడేసి అత్యాచారానికి యత్నించాడు. మహిళ గట్టిగా అరుస్తూ.. నిందితుడిని తోసేసింది. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో భయపడిన బాధితురాలు కూడా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లింది.
READ MORE: Char Dham Yatra: చార్‌ధామ్ యాత్రలో భక్తుల రద్దీ.. ఈనెల31 వరకు వీఐపీ దర్శనాలు బంద్
Also Read
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
- Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
ఈ ఘటన అంతా రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. ఈ మొత్తం వ్యవహారం పోలీసుల దృష్టికి రావడంతో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వైరల్ వీడియో ఆధారంగా రావత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతి షాపింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఓ యువకుడు ఆమెను రోడ్డుపై వేధించాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు యువకుడు మద్యం తాగి ఉండొచ్చని తెలుస్తోంది. అతి త్వరలో అతన్ని పట్టుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..