Tragedy: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అనంతలోకాలకు.. అన్న ఇద్దరు చెల్లెల్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ అన్న.. ఇద్దరు చెల్లెల్లు మృతి చెందారు. మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదం.. గ్రేటర్ నోయిడాలోని ప్యారీ చౌక్ సమీపంలో జరిగింది. నలుగురు కలిసి బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. వీరంతా.. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మధురలోని జైత్ గ్రామానికి చెందిన శివ్ సింగ్ తన కుటుంబంతో కలిసి కులేసరలోని మధుబన్ విహార్ కాలనీలో నివసిస్తున్నారు. గురువారం.. తన కుమారుడు సురేంద్ర సింగ్, కూతుర్లు శైలీ, అన్షు, తన స్నేహితురాలు సిమ్మితో కలిసి బైక్‌పై కస్నాకు వెళ్లినట్లు శివ్ సింగ్ చెప్పాడు. కస్నాలో వివాహ వేడుకకు వెళ్లినట్లు తెలిపాడు. అనంతరం నలుగురు బైక్‌పై రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పాడు.
Also Read
Lore and George: వరల్డ్ ఓల్డెస్ట్ అవిభక్త కవలలు ఇకలేరు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 2.30 గంటల సమయంలో ప్యారీ చౌక్ సమీపంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారని… వారందరినీ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే.. అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడిన బాలిక సిమ్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కాలు మొత్తం నుజ్జునుజ్జైంది. కాగా.. ఈ ఘటనలో గుర్తు తెలియని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సెక్టార్ బీటా-2 కొత్వాలి పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. డిసెంబర్‌లో కొడుకు సురేంద్ర సింగ్ పెళ్లి జరగాల్సి ఉంది. అందుకు సంబంధించి ఇంట్లో పెళ్లి సన్నాహాలు మొదలయ్యాయి. అయితే కుటుంబమంతా సంతోషంగా ఉండాల్సిన సమయంలో విషాదంగా మారింది. మరోవైపు.. ఒక్కసారిగా మూడు మృతదేహాలను చూసిన తల్లిద్రండుల రోదనలు మిన్నంటాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు