Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో గవర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సీనియర్ లీడర్స్ దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ ఈ సామాజికవర్గానికి చెందినవారే. అనకాపల్లి సిట్టింగ్ ఎంపీ భీశెట్టి సత్యవతి, విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు కూడా గవర్లే. ఉమ్మడి విశాఖ వరకు నామినేటెడ్ పదవుల్లోనూ వీళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాయి రాజకీయపార్టీలు. ఉత్తరాంధ్రలో ఈ సామాజికవర్గానికి చెందినవారు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. విశాఖ పశ్చిమ, ఉత్తర, దక్షిణ,…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్‌గా కొనసాగుతూనే ఉంది.. మా విధానం మూడు రాజధానులు. మా నిధానం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి… ఇదే మా లక్ష్యం అంటున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. మూడు రాజధానుల వ్యవహారం కోర్టులో ఉంది. అమరావతి సంగతి తేలితే కానీ మూడు రాజధానుల కాన్సెస్ట్ ఫైనల్ కాదు. అయితే ఈ లోగా కొత్త కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. అమరావతే రాజధాని అంటే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటున్నారు మంత్రి…
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు తెగ తాపత్రయ పడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఆయనకు జవసత్వాలు అయిపోయాయని.. అందుకే వాటిని నిలుపుకోవడానికి పర్యటనలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిర్మాణాత్మకమైన అంశాలు చెబితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారని.. కానీ అసత్యాలు చెప్తే నమ్మరనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజాం, బొబ్బిలి సభలలో చంద్రబాబు అన్నీ అసత్యాలే చెప్పారని మంత్రి బొత్స మండిపడ్డారు. బొబ్బిలి రైతు…
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సబ్ రీజియన్స్‌లో ఒకటి ఉత్తరాంధ్ర. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కలిపి మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంత ఓటర్ల తీర్పు ఏకపక్షమైన ప్రతీసారీ పార్టీలు అనూహ్యమైన విజయాలను కైవశం చేసుకుంటున్నాయి. 1994 ఎన్నికల్లో తొలిసారి ఉమ్మడి అభ్యర్థులతో కలిపి 33స్థానాలను గెల్చుకుంది టీడీపీ. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి కళా వెంకట్రావు ఒక్కరే ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ 2019లో వైసీపీ గాలి వీచింది. 28 చోట్ల గెలిచి…
Tammineni Sitaram: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ రాజధాని సాధన ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చరిత్ర ఉందని.. నాడు ప్రజల తీవ్రమైన భావావేశాన్ని ప్రదర్శించి గట్టిగా అడిగారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, జీవించే హక్కు కోసం…
Tammineni Sitaram: అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అది రైతుల యాత్ర కాదని.. బినామీ యాత్ర అని వర్ణించారు. పాదయాత్ర చేసేది రైతులు కాదని తాము తొలిరోజు నుంచి చెప్తున్నామని.. ముసుగువీరులు ఎవరో శాసనసభలోనే చెప్పామని తమ్మినేని సీతారాం గుర్తుచేశారు. 28వేల మంది వద్ద బలవంతంగా భూములు లాక్కొంటే పాదయాత్రకు ఎంత మంది వచ్చారో అందరూ చూశారన్నారు. ఐడెంటెటీ కార్డులు కేవలం 70…
Andhra Pradesh: ఇటీవల విశాఖలో మంత్రులపై దాడి ఘటన ఏపీలో పెనుదుమారం రేపింది. అయితే తాజాగా తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలోని మంత్రులు, పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. అర్జీలు ఇచ్చే సాకుతో జనసేన కార్యకర్తలు దాడులు చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ విభాగం వార్నింగ్ ఇచ్చింది. టెక్కలిలో జనసేన కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి అలర్ట్ కావాలంటూ ఇంటెలిజెన్స్…
Dadisetti Raja: ఈనెల 15 నుంచి ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో వైసీపీ నేతలు విమర్శలు చేశారు. కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని.. వారిలో ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రణాళికలో భాగంగానే…