PM Modi: ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వ హయాంలో మన దేశ భద్రతాబలగాలు ఉగ్రవాదుల్ని వాళ్ల సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని గురువారం అన్నారు.
ఉత్తరఖండ్లోని రాంనగర్ సమీపంలోప ఉండే గర్జియా మాత ఆలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆలయం కోసి నది ఒడ్డున ఉంది.
నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్ తో పాటు రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్‌లోని కోట్‌పుట్లీలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని నానక్‌మట్టా గురుద్వారాకు చెందిన కరసేవా చీఫ్ బాబా తార్సేమ్ సింగ్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
ఏప్రిల్ 2వ తేదీన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్- ఉధమ్ సింగ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం రుద్రాపూర్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Tiger attack: పెద్ద పులిని చూస్తేనే సగం ప్రాణాలు పోతాయి. ఇక అది దాడి చేస్తే తప్పించుకోవడం అంత సులభం కాదు. కానీ ఉత్తరాఖండ్‌కి చెందిన 17 ఏళ్ల బాలుడు మాత్రం పెద్దపులితో వీరోచితంగా పోరాడి ప్రాణాలు దక్కించుకున్నాడు. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో రామ్‌నగర్ పట్టణానికి చెందిన అంకిత్ పులిదాడికి గురయ్యాడు. ప్రాణాంతక దాడి తర్వాత అనేక శస్త్రచికిత్సలు చేయించుకుని మళ్లీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు.
దేశంలో ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ (Weather Alert) హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
New Delhi : ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) బుధవారం (ఫిబ్రవరి 28) ఖజూరి ఖాస్ ప్రాంతంలో ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్‌ను ప్రారంభించి అనేక ఇళ్లను కూల్చివేసింది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన కూల్చివేతల కారణంగా నిరాశ్రయులైన వారిలో వకీల్ హసన్ కూడా ఉన్నారు.