Live-in relationship: దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బీజేపీ నేతృత్వంలోని పుష్కర్ సింగ్ ధామి సర్కార్ ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా ఈ బిల్లులోని కొన్ని అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా లివ్-ఇన్ రిలేషన్ షిప్‌పై కీలక నియమ నిబంధనలను తీసుకువచ్చింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయాలు హీటెక్కాయి. దీనిపై దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. కాగా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ డాక్టర్ సయ్యద్ తుఫైల్ హసన్ (ఎస్టీ హసన్) సంచలన కామెంట్స్ చేశాడు. యూసీసీ బిల్లు ఖురాన్‌కు విరుద్ధమైతే వ్యతిరేకిస్తాం..
ఉమ్మడి పౌర స్మృతి( యూసీసీ ) బిల్లును ఇవాళ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రవేశ పెట్టబోతున్నారు. ఇటీవల ఆ బిల్లును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. భారతీయ పౌరులు అందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా ఈ బిల్లును రూపొందించారు.
Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లును తీసుకువచ్చేందుకు ఉత్తరాఖండ్ సిద్ధమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసులను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని క్యాబినెట్ ఆదివారం ఆమోదించింది. ఫిబ్రవరి 6 ఈ బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. డెహ్రాడూన్‌లో సీఎం ధామి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Haridwar: ఉత్తరాఖండ్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. బ్లడ్ క్యాన్సర్ నుంచి తన మేనల్లుడిని కాపాడాలని వెర్రితనం 4 ఏళ్ల బాలుడి ప్రాణాలను తీసింది. బాలుడు రవి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అయితే, గంగా నదిలో 5 నిమిషాల పాటు నీటిలో ముంచితే అద్భుతం జరుగుతుందని బాలుడి మేనత్త సుధ మూఢనమ్మకం పెట్టుకుంది. చివరకు బాలుడు మరణించడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
Chlorine gas leak in Uttarakhand: ఉత్తరఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. డెహ్రాడూన్‌కు సమీపంలోని ఝంజ్రాలో క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సహాయక చర్యలతో అక్కడ పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రేమ్ నగర్ పోలీసు స్టేషన్…
Dehradun : ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 12 రోజులుగా కనిపించకుండా పోయిన బాలిక మృతదేహం అడవిలో సగం కాలిన స్థితిలో లభ్యమైంది.
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ నగరం కుంగిపోయిన వార్త దేశంలో, ప్రపంచంలో సంచలనం సృష్టించింది. చాలా మంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు జోషిమఠ్‌లో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు జోషిమఠ్ నగరంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు ఇప్పుడు బయటకు వచ్చారు. వారి కుటుంబాలు గత 17 రోజులుగా ఈ కూలీల కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే బయటకు వచ్చేసరికి కార్మికుల ముఖాల్లో ఆనందం కనిపించింది.