Uttarakhand: దేశంలోనే తొలిసారిగా ‘యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)’ బిల్లును తీసుకు వచ్చి చరిత్ర సృష్టించిన ఉత్తరాఖండ్ మరో ప్రతిష్టాత్మక బిల్లుకు సిద్ధమవుతోంది. నిరసనల సందర్భంగా ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ నేతృత్వంలోని సీఎం పుష్కర్ సింగ్ ధామి సర్కార్ ‘‘ఉత్తరాఖండ్ పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లు’’ని సోమవారం బడ్జెట్ సెషన్‌లో ప్రవేశపెట్టనునంది.
Haldwani violence: ఉత్తరాఖండ్ హల్ద్వానీ ప్రాంతంలో ఫిబ్రవరి 8న తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అక్రమంగా నిర్మించిన మదర్సాను అధికారులు కోర్టు ఆదేశాల మేరకు కూల్చవేస్తున్న తరుణంలో హింస చోటు చేసుకుంది. పోలీసులు, ఇతర అధికారులే టార్గెట్‌గా స్థానికులు విరుచుకుపడ్డారు. పోలీసులను నిర్బంధించి నిప్పు పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు వారిపై దాడి చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నైనిటాల్ జిల్లాలోని బన్‌భూల్‌పురా పట్టణంలో 'అక్రమ' మదర్సా కూల్చివేతపై హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ తాత్కాలిక సడలించింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టు విస్తరణ, మొదటి దశ కింద హెలిపోర్టుల నిర్వహణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. రెండో దశలో విమానాశ్రయాలు, హెలిపోర్టుల పనులు త్వరలో పూర్తి కాబోతున్నాయి.
Haldwani violence: ఉత్తరాఖండ్ ఆర్థిక రాజధాని హల్ద్వానీలోని బన్‌భూల్‌పురాలో ఇటీవల అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేత ఘటన తీవ్రమైన అల్లర్లకు దారి తీసింది. ఆ ప్రాంతంలోని ప్రజలు, అధికారులు, పోలీసులు, జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడ్డారు. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పాటు పలు వాహానాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు. పోలీసులను సజీవ దహనం చేసే ప్రయత్నం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగినట్లు అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంఘ…
Pushkar Sing Dhami: ఉత్తరాఖండ్ హల్ద్వానీలోని బన్‌భూల్‌పురా అక్రమ మదర్సా కూల్చివేత తీవ్రమైన అల్లర్లకు కారణమైంది. కూల్చివేత సమయంలో ఆ ప్రాంతంలోని వ్యక్తులు అల్లర్లకు పాల్పడటమే కాకుండా, పోలీసులపై, జర్నలిస్టులపై దాడి చేశారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు మరణించారు. 100కు పైగా మంది పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ అల్లర్లకు కారణమైన ప్రధాన నిందితుల కోసం పోలీసులు, నిఘా వర్గాలు వేట కొనసాగిస్తున్నాయి.
త్తరాఖండ్లోని హల్ద్వానీలో చోటు చేసుకున్న హింస ఇప్పుడు రాష్ట్రంలోని ట్రాఫిక్ వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల బస్సులను రద్దు చేయగా.. మరి కొన్ని ప్రాంతాల్లో బస్సులను ఇతర మార్గాలకు మళ్లించారు.
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గురువారం రోజు హల్ద్వానీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన మదరసాను అధికారులు కూల్చేశారు. ఈ ఘటన తర్వాత కొంతమంది దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు వాహనాలతో పాటు ఇతర ప్రాంతాలకు నిప్పు పెట్టారు.