నాలుగు నెలల్లో ముగ్గురు సీఎంలు మారిన పరిస్థితి.. రెండో సీఎం రాజీనామా చేయడంతో.. మూడో సీఎం ఎవరు అనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో.. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామిని ఎన్నుకుది బీజేపీ శాసనసభాపక్ష సమావేశం.. నిన్న తీరథ్‌సింగ్ రావత్ రాజీనామా చేయడంతో సీఎం పదవి ఖాళీ అయ్యింది.. అయితే, ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పుష్కర్ సింగ్ ధామిని ఎన్నుకుంది.. డెహ్రాడూన్ లో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారల ఇంఛార్జ్ నరేంద్రసింగ్ తోమర్…
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బాధ్యతలు స్వీకరించనున్నారు.. సీఎంగా పుష్కర్ సింగ్ ధామి పేరును ఖరారు చేసింది బీజేపీ.. దీంతో.. తదుపరి సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. నిన్న తీరథ్‌సింగ్ రావత్ రాజీనామా చేయడంతో సీఎం పదవి ఖాళీ అయ్యింది.. అయితే, ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పుష్కర్ సింగ్ ధామిని ఎన్నుకున్నారు. డెహ్రాడూన్ లో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారల ఇంఛార్జ్ నరేంద్రసింగ్ తోమర్ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది.…
ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ రాజీనామా చేశారు.. గత మార్చిలో సీఎంగా ప్రమాణం చేసిన రావత్.. సెప్టెంబర్‌లోగా అసెంబ్లీ ఎన్నిక కావాల్సి ఉంది… ఆయన ప్రస్తుతం లోక్‌సభ సభ్యులు.. అయితే, కరోనా కారణంగా సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.. మరోవైపు ఉత్తారాఖండ్ అసెంబ్లీలోకి వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగాల్సి ఉంది.. అసెంబ్లీకి ఏడాదిలో ఎన్నికలు ఉంటే.. ఉప ఎన్నిక నిర్వహించరాదనే నిబంధన ఉంది.. దీంతో.. రావత్.. అసెంబ్లీకి ఎన్నికయ్యే…
హరిద్వార్ లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్నది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వేడుకల్లో కుంభమేళా కూడా ఒకటి. ఇలాంటి వేడుకలకు కోట్లాది మంది భక్తులు హాజరవుతుంటారు. నాలుగు నెలలపాటు ఈ వేడుక జరగాల్సి ఉన్నా, కరోనా కారణంగా నెలకు కుదించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కుంభమేళాను నిర్వహిస్తున్నారు. అయితే, కుంభమేళలో శాహిస్నాన్ ముఖ్యమైనది. ఈ శాహి స్నాన్ వేడుకలో లక్షలాది మంది సాధువులు పాల్గొంటారు. బుధవారం రోజున జరిగిన ఈ రాజస్నానం వేడుకలో సుమారుగా 13.5 లక్షల మంది సాధువులు, నాగా సాధువులు పాల్గొన్నారని అధికారులు చెప్తున్నారు. అయితే,…
ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి కోలుకునేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సందర్శక ప్రాంతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు హోటల్స్ బుకింగ్‌లో డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ‘టూరిస్ట్ ఇన్సెంటివ్ కూపన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా పర్యాటకుల హోటల్స్ బుకింగ్‌లో రూ.1000 లేదా 25శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ఈ డిస్కౌంట్ కూపన్ పొందాలంటే ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కనీసం మూడు రోజులు ఉండేలా బుకింగ్…