ఉత్తరాఖాండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లాలోని ఓఖల్‌కండ బ్లాక్‌లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో హల్ద్వానీ నుంచి ఓఖల్‌కండ బ్లాక్‌లోని పూదపురి గ్రామానికి వెళ్తున్న మ్యాక్స్ వాహనం పాట్లోట్ సమీపంలో 200 అడుగుల లోతులో పడిపోయింది.
ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా సాధారణ రుతుపవనాలు ముందే వస్తున్నాయి.. దీని వల్ల ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండవచ్చని ఐఎండీ అధికారులు చెప్పుకొచ్చారు.
ఫ్రొఫెసర్ల వేధింపులతో ఓ జూనియర్ డాక్టర్ నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ దివేష్ గార్గ్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఒక ప్రొఫెసర్ తన కొడుకు థీసిస్‌ను రెండుసార్లు తిరస్కరించాడని.. ప్రొఫెసర్లు నిరంతరం వేధింపులకు పాల్పడటంతోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
బ్యాగ్‌లు అమ్మే నెపంతో ఓ ఇంట్లోకి నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించిన దొంగ.. చిన్నారిని చంకలో పెట్టుకుని పారిపోయాడు. స్థానికులు అతని కోసం వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని రుద్రనగర్ లో చోటు చేసుకుంది. ఈ విషయంపై చిన్నారి తల్లి షీలా బధోయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని తెలిపింది.
ఉత్తరాఖండ్లో గంజాయి స్మగ్లింగ్ బ్లాక్ వ్యాపారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. మంగోలి ప్రాంతంలో 31.99 గ్రాముల గంజాయి తరలిస్తున్న బరేలీకి చెందిన స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
చార్‌ధామ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యాత్రకు భక్తులు పోటెత్తారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. చార్‌ధాయ్ యాత్ర ఈ నెల 10న ప్రారంభమైన విషయం తెలిసిందే.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం యుద్ధం అంచున ఉన్న ఈ తరుణంలో భారత్‌కి ప్రధాని మోడీ బలమైన నాయకత్వం అవసరమని బుధవారం అన్నారు.
భూ వైకుంఠంలో వెలసిన విష్ణుమూర్తి నివాసమైన బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి. ఈరోజు ఉదయం 6 గంటలకు ఆర్మీ బ్యాండ్ మేళవింపుల నడుమ సంపూర్ణ ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణలు, బద్రీ విశాల్ లాల్ కీ జై అనే నినాదాలతో భక్తుల కోసం బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి.
దేశంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉక్కపోత, వేడిగాలుల నుండి ప్రజలు త్వరలో ఉపశమనం పొందబోతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ(IMD) ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇదిలా ఉంటే శుక్రవారం చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఇంతలో భారీ వర్షాలు స్థానికులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.