Supreme Court: కన్వర్ యాత్రం మార్గంలోని ఉన్న హోటళ్లు , రెస్టారెంట్లలో క్యూఆర్ కోడ్‌లను ప్రదర్శించాలని ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆదేశించాయి.అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, రెండు రాష్ట్రాల ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. క్యూఆర్ కోడ్ ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోరాగఢ్ జిల్లాలో మంగళవారం (జులై 15) సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న ఓ కార్ (టాక్సీ) అదుపు తప్పి సుమారు 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం సోనీ వంతెన సమీపంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఈ టాక్సీలో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. Read Also:Handri Neeva:…
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఇటీవలే యజమాని భార్యను, కొడుకును పని మనిషి ఘోరంగా చంపేశాడు. కేవలం తిట్టారన్న కోపంతో నిందితుడు ఈ ఘతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను మరువక ముందే తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. మహిళ, ఆరు నెలల శిశువు దారుణ హత్యకు గురయ్యారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 67 సంవత్సరాలు. ఆమె 1958లో ఈ రోజున జన్మించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు నాయకులు రాష్ట్రపతి ముర్ము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు ముర్ము ఉత్తరాఖండ్‌లో తన పుట్టినరోజును జరుపుకుంటారు. ఈ సమయంలో ఆమె ఇక్కడి ప్రజలకు ఒక ప్రత్యేక బహుమతిని కూడా ఇవ్వనున్నారు. రాజ్‌పూర్ రోడ్డులో నిర్మించిన రాష్ట్రపతి నికేతన్‌లో ఆమె తన పుట్టినరోజును జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆమె చాలా ఆధునిక…
Ankita Bhandari Murder Case: 2022లో రాజకీయంగా సంచలనం సృష్టించిన అంకితా భండారీ హత్య కేసులో ఈ రోజు తీర్పు వెలువడనుంది. పౌరి జిల్లా యమకేశ్వర్లో ఉన్న వనాంతర రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న 19 ఏళ్ల అంకిత హత్యకు గురికావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలిపారు
పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఆపరేషన్ని ముగించుకుని వెనుదిరిగింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు.
Kedarnath Dham: ఉత్తరాఖండ్ కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో యాత్రికులు డీజే మ్యూజిక్, డ్యాన్సులు చేస్తున్న వీడియో వైరల్గా మారింది. పవిత్రమైన ఆలయం ముందు డ్యాన్సులు, డీజే మ్యూజిక ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.