38th National Games: 38వ జాతీయ క్రీడల నిర్వహణ తేదీలు ఖరారు అయ్యాయి. ఈ క్రీడలకు ఉత్తరాఖండ్ జనవరి 28, 2025 నుండి జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) 36 క్రీడల తేదీ, జాబితాను విడుదల చేస్తూ అధికారిక లేఖను విడుదల చేసింది. 38వ జాతీయ క్రీడలను ఉత్తరాఖండ్‌లో 28 జనవరి 2025 నుండి 14 ఫిబ్రవరి 2025 వరకు నిర్వహించనున్నట్లు భారత ఒలింపిక్ సంఘం ఒక లేఖను విడుదల చేస్తూ…
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓవర్‌లోడ్‌తో కూడిన బస్సు లోతైన లోయలో పడడంతో 36 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.
Bus Fall Into Ditch: ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ప్రయాణికులతో నిండిన బస్సుకు ప్రమాదం జరిగింది. మార్చులా ప్రాంతం సమీపంలో ప్రయాణికులతో నిండిన బస్సు కాలువలో పడింది. ఘటన సమయంలో బస్సులో 35 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన స్థలానికి ఎస్‌ఎస్పీ అల్మోరా చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం SDRF సంబంధించిన మూడు బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. దాంతో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందినట్లు అల్మోరా…
ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర 2024 నవంబర్ నెలలో చివరికి చేరుకుంది. నవంబర్ 2న గంగోత్రి ధామ్ తలుపులు మూసేయగా.. నవంబర్ 3న కేదార్‌నాథ్ ధామ్ ఆలయాన్ని కూడా క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు కూడా చట్ట ప్రకారం మూసివేశారు. మే 10న ప్రారంభమైన చార్‌ధామ్ యాత్రలో ఈ ఏడాది గంగోత్రి, యమునోత్రి ధామ్‌లకు వచ్చిన భక్తులలో ఇప్పటివరకు 53 మంది మరణించారు.
Char Dham Yatra: భక్తిశ్రద్ధలతో కొనసాగున్న చార్‌ధామ్ యాత్ర చివరి దశకు చేరుకుంది. శీతాకాలం రాకతో నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు క్లోజ్ చేయనుండగా.. ఆ తర్వాత ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనాన్ని కొనసాగిస్తారు.
HIV cases: ఉత్తరాఖండ్‌లో హెచ్ఐవీ కేసుల పెరుగుదల కలకలం రేపుతోంది. రాంనగర్‌లో హెచ్ఐవీ కేసులు సంఖ్య హఠాత్తుగా పెరిగింది. దీనిపై అక్కడి ఆరోగ్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 19 నుంచి 20 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇది స్థానికంగా ఆరోగ్య శాఖలో హెచ్చరికల్ని పెంచింది.
ఉత్తరాఖండ్‌లోని మున్సియారీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం తర్వాత కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేయబడింది.
Train Accident: ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై 15 మీటర్ల పొడవైన హైటెన్షన్ వైర్ పడి ఉండడాన్ని డెహ్రాడూన్- తనక్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్లు గుర్తించి అత్యవసరంగా రైలును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది.