Visa ban: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి వారికి ఆష్ర్టేలియా షాకిచ్చింది. ఇండియాలోని కొన్ని రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ఆష్ర్టేలియాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఇండియా విద్యార్థులకు వీసా ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హరియాణా, పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఆయా రాష్ర్టాలకు చెందిన విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులను స్వీకరించవద్దని ఫెడరేషన్ యూనివరి్సటీ,…
Uttarakhand: ఓ వ్యక్తి ఉత్తరాఖండ్ కి చెందిన హిందూ యువతిని మోసం చేశాడు. మహ్మద్ ఇఖ్లాష్ అనే వ్యక్తి మనోజ్ గా తన పేరు మార్చుకుని ఓ హిందూ యువతితో పరిచయం పెంచుకుని, ప్రేమిస్తున్నట్లు నటిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటి ఆగకుండా అభ్యంతరకర వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. ప్రస్తుతం యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మహ్మాద్ ఇఖ్లాష్ మనోజ్ గా నటిస్తూ, గురుగ్రామ్ లోని జీడీ గోయెంకా యూనివర్సిటీలో చదువుతున్నట్లు యువతిని…
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు తన కుమార్తె వివాహాన్ని ముస్లిం వ్యక్తితో కుదిర్చాడు. ఇరువురు ఇష్టపడటంతో ఇరు కుటుంబాలు ఒప్పుకోవడం పెళ్లికి సిద్ధపడ్డాడు. ఇదిలా ఉంటే పెళ్లికి సంబంధించిన పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పెళ్లిపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో చివరకు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. మే 28న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఈ విషయంలో హిందూ సంస్థల ఒత్తడి కూడా ఉంది.…
Domestic Violence: మాజీ ప్రధాని మనవరాలికి కూడా గృహహింస, వరకట్న వేధింపులు తప్పడం లేదు. మాజీ ప్రధాని వీపీ సింగ్ మనవరాలైన అద్రిజా మంజరీ సింగ్ తాను గృహహింస ఎదుర్కొంటున్నట్లుగా డెహ్రాడూన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఆర్కేష్ నారాయణ్ సింగ్ డియోతో పాటు అతని తండ్రి, కుటుంబ సభ్యులపై డెహ్రడూన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్‌లో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేదార్‌నాథ్ ధామ్‌లోని హెలిప్యాడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హల్ద్ వాని జైలులో ఉన్న 44 మంది ఖైదీల్లో హెచ్ఐవీ సోకినట్లు గుర్తించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉండడం విశేషం. చాలా మంది సోకిన ఖైదీలు ఎన్డీపీఎస్ చట్టం కింద ఉంచబడ్డారు. సునీల తివారీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Haldwani jail: హల్ద్వానీ జైలులో కలకలం రేగింది. ఏకంగా ఓ మహిళలో పాటు 40 మందికి పైగా ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మొత్తం 44 మంది ఖైదీలు ప్రస్తుతం ఆస్పత్రి పాలయ్యారు. ఈ వార్త జైలు అధికారుల్లో కలకలం రేపింది. నెలకు రెండు సార్లు ఆస్పత్రి నుంచి ఓ టీమ్ సాధారణ చెకప్ కోసం జైలుకు వెళ్తుంది. తేలిక పాటి సమస్యలు ఉన్న ఖైదీలందరికీ అక్కడే మందుల్ని అందచేస్తారు. తీవ్ర సమస్యలు ఉన్నవారికి…
తన వద్ద శిక్షణ పొందుతున్న ముగ్గురు క్రికెటర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెట్ కోచ్ నరేంద్ర షా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. యువ క్రికెటర్లను లైంగికంగా వేధించిన కేసులో కోచ్ నరేంద్ర షాను పోలీసులు అరెస్టు చేశారు.
Kedarnath Dham: కేదార్ నాథ్ ధామ్ పోర్టల్ ను భక్తులందరకీ ఏప్రిల్ 25న తెరవనున్నట్లు అధికారులు ఈ రోజు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి ఈ కేధార్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. భక్తులు కాలినడకతో పాటు హెలికాప్టర్ ద్వారా కేదార్ నాథ్ ధామ్ చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించే యాత్రికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించనుంది.
ఉత్తరాఖండ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. డెహ్రాడూన్‌లో గరిష్టంగా కరోనా వైరస్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు రోగులు కూడా చనిపోతున్నారు. ఐదుగురు రోగులు ప్రస్తుతం డూన్ ఆసుపత్రిలో ఐసియులో చేరారు.