Helicopter Blades: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్‌లో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేదార్‌నాథ్ ధామ్‌లోని హెలిప్యాడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రభుత్వ అధికారి జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ వెలుపల సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ హెలికాప్టర్ టెయిల్ రోటర్ బ్లేడ్ పరిధిలోకి వచ్చాడు. ప్రమాదవశాత్తు హెలికాప్టర్ టెయిల్ రోటర్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. జితేంద్ర కుమార్ సైనీ అనే అధికారి ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఫైనాన్షియల్ కంట్రోలర్‌గా ఉన్నారు.
Read Also: Chalaki Chanti: చలాకీ చంటికి గుండెపోటు.. పరిస్థితి విషమం
యాత్రికుల కోసం ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి మరియు యమునోత్రి పోర్టల్‌లను ప్రారంభించి అక్షయ తృతీయ సందర్భంగా చార్ ధామ్ యాత్ర ప్రారంభించిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. తీర్థయాత్ర కోసం ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు నమోదు చేసుకున్నారు. వారి సంఖ్య పెరుగుతోంది. కాగా, కేదార్‌నాథ్‌ను ఏప్రిల్ 25న, బద్రీనాథ్‌ను ఏప్రిల్ 27న తెరవనున్నారు.