ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. అక్రమ కట్టడంగా నిర్ధారించిన మదర్సా కూల్చివేత అని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హింస కొనసాగింది. గురువారం రాత్రి బన్‌బూల్‌పుర పోలీస్ స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టాగా.. ఆరుగురు చనిపోగా, వందకు పైగా గాయపడ్డారు. ఇక, అల్లరి మూకలు ప్రణాళిక ప్రకారం ఘర్షణలు సృష్టిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంతో పాటు పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్‌లోనూ హై అలర్ట్ ప్రకటించారు. దీంతో వాహనాలను నిశితంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
Read Also: Telangana Budget 2024: మహ్మద్ రజబ్ అలీ తర్వాత ఖమ్మం నుంచి ఒకే ఒక్కడు భట్టి..!
దీంతో ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చోటు చేసుకున్న హింస ఇప్పుడు రాష్ట్రంలోని ట్రాఫిక్ వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల బస్సులను రద్దు చేయగా.. మరి కొన్ని ప్రాంతాల్లో బస్సులను ఇతర మార్గాలకు మళ్లించారు. అదే విధంగా, పలు రైళ్లను కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి హింస చెలరేగకూండా పోలీసులు సున్నీతమై ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
Read Also: Railway Ticket Inspector: తొలి రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా ట్రాన్స్‌జెండర్!
అయితే, హల్ద్వానీ పట్టణంలోని బన్‌భూల్‌పూర్ ప్రాంతంలో మదరసా, ప్రార్థనలకు వినియోగించే ఒక నిర్మాణం ఉంది. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా కట్టిన ఆ నిర్మాణాలను కూల్చివేసేందుకు గురువారం సాయంత్రం మున్సిపల్ సిబ్బంది ట్రై చేశారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత ప్రక్రియ స్టార్ట్ అయింది. అరగంటలోపే భారీ సంఖ్యలో జనం అక్కడికి రావడంతో పాటు మరి కొందరు చుట్టుపక్కల భవనాలపైకెక్కి మున్సిపల్ సిబ్బంది, పోలీసులపైకి రాళ్లతో దాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.