Haridwar: ఉత్తరాఖండ్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. బ్లడ్ క్యాన్సర్ నుంచి తన మేనల్లుడిని కాపాడాలని వెర్రితనం 4 ఏళ్ల బాలుడి ప్రాణాలను తీసింది. బాలుడు రవి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అయితే, గంగా నదిలో 5 నిమిషాల పాటు నీటిలో ముంచితే అద్భుతం జరుగుతుందని బాలుడి మేనత్త సుధ మూఢనమ్మకం పెట్టుకుంది. చివరకు బాలుడు మరణించడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Jagga Reddy : రాహుల్ గాంధీ ప్రజలను సంఘటితం చేసే పనిలో ఉన్నారు
బుధవారం మధ్యాహ్నం గంగా నది ఒడ్డున ఉన్న హర్ కీ పౌరీ ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గంగా నదిలో ఎక్కువ సేపు స్నానం చేయిస్తే రవికి బ్లడ్ క్యాన్సర్ నయం అవుతుందని సుధ నమ్మింది. ఆమె దాదాపుగా 5 నిమిషాల పాటు నదిలో ముంచి స్నానం చేయించింది. అయితే సుధ చేస్తున్న పనిని పక్కనే ఉన్న వారు గమనించి బాలుడిని బయటకు తీసుకువచ్చారు. అప్పటికే బాలుడు మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాలుడు రవిని గంగలో ముంచడాన్ని కొందరు వ్యక్తులు గమనించి జోక్యం చేసుకున్నారు. అయితే ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రవిని కాపాడేందుకు ప్రయత్నించిన ఒకరిని కొట్టేందుకు ప్రయత్నించింది.
Video caution⚠
अंधविश्वास के शिकार, ये मानसिक बीमार”
हरिद्वार में एक बहुत ही हैरान करने वाला मामला सामने आया है हरकी पैड़ी गंगा घाट पर मौसी ने 7 साल के मासूम लड़के को गंगा नदी में डुबाकर मौत के घाट उतार दिया पुलिस ने हत्यारोपी मौसी को गिरफ्तार कर लिया।ब्लड कैंसर से जूझ रहे सात… pic.twitter.com/1lvY6gG2Zm
— Lavely Bakshi (@lavelybakshi) January 24, 2024