Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే వారిని రక్షించేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సొరంగంలో 170 గంటలుగా కార్మికులు చిక్కుకుపోయి ఉండటం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందనే ఆందోళన పెరుగుతోంది. ఇప్పటి వరకు టన్నెల్ ముందు నుంచి రంధ్రం చేసి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యంత్రాలను రప్పించి…
Chardham Templs: శీతాకాలం దృష్ట్యా ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ కేదార్‌నాథ్ ఆలయ తలుపులను బుధవారం మూసివేశారు. సంప్రదాయం ప్రకారం ఉదయం 8.30 గంటలకు వేద మంత్రోచ్ఛరణల మధ్య పండితులు మహాద్వారాన్ని మూసివేశారు.
Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 40 మంది కూలీల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయపనులు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సాంకేతిక కారణాలు, కొండచరియలు విరిగిపడటం సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. సొరంగంలో చిక్కుకుపోయిన కూలీల కోసం భారత వైమానిక దళానికి చెందిన మూడు ప్రత్యేక విమానాలు 25 టన్నుల ప్రత్యేక యంత్ర సామాగ్రిని సరఫరా చేసింది.
Uttarakhand Tunnel Collapse Update: ఉత్తరాఖండ్ టెన్నెల్ వద్ద సహాయక చర్యలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో మంగళవారం భారీ డయామీటర్ పైపులు, డ్రిల్లింగ్ యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Uttarkashi Tunnel : ఉత్తరకాశీలో దీపావళి రోజున యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి NDRF బృందం రెండవ రోజు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా ఉండడం ఉపశమనం కలిగించే అంశం. వారికి ఆహార పానీయాలు పంపిణీ చేశారు.
Uniform civil code: యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లును తీసుకువచ్చేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం వచ్చే వారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనుంది. యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ వార్తల్లో నిలిచింది. దీనిపై ఏర్పాటు చేసిన జస్టిస్(రిటైర్డ్) రంజనా దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి నివేదిక సమర్పించనుంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్రం మనా పాస్‌కు చేరుకుని సరిహద్దుల్లో మోహరించిన సైనికులతో సమావేశమయ్యారు.
ఉత్తర భారతాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. నేపాల్‌లో 6.2 భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.
నేపాల్‌లో రెండు భూకంపాలు సంభవించిన తర్వాత ఈరోజు ఢిల్లీలో భారీ ప్రకంపనలు సంభవించాయి. రియాక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. ఢిల్లీతోపాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని ఇతర ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించింది. నోయిడాలో 10 నుంచి 15 సెకన్ల పాటు భూకంపం సంభవించింది.