Uniform Civil Code Bill: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయాలు హీటెక్కాయి. దీనిపై దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. కాగా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ డాక్టర్ సయ్యద్ తుఫైల్ హసన్ (ఎస్టీ హసన్) సంచలన కామెంట్స్ చేశాడు. యూసీసీ బిల్లు ఖురాన్‌కు విరుద్ధమైతే వ్యతిరేకిస్తాం.. అయితే ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదు అని ఆయన అన్నారు. ముస్లింలు ఖురాన్ ను మాత్రమే అనుసరిస్తారు.. ఈ ప్రభుత్వం తీసుకొచ్చే యూసీసీ చట్టాన్ని కాదు అని ఆయన వెల్లడించారు.
Read Also: Bihar Congress: హైదరాబాద్ లో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల షాపింగ్..!
అయితే, మేం ఖురాన్ మార్గదర్శకత్వంలో జీవిస్తున్నాం.. ఖురాన్‌కు వ్యతిరేకంగా యూసీసీ బిల్లు లేకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఎస్‌టి హసన్ అన్నారు. 76 ఏళ్లుగా దేశం ప్రశాంతంగా ముందుకు కొనసాగుతుంది.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు.. ఇప్పుడు కొందరు దేశాన్ని విభజించాలనుకుంటున్నారు అందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని ఎస్టీ హసన్ ఆరోపించారు. ఇక, ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకు రావడం మంచిదే.. కానీ, అది దుర్వినియోగం అవుతుందని తెలిపారు. ఎందుకంటే ప్రతి మతం యొక్క ఆచారాలు, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి.. ప్రతి మతానికి దాని స్వంత నియమాలు ఉంటాయి.. దాని ప్రకారం మాత్రమే నడుచుకుంటారు తప్పా.. అందరికి ఒకే చట్టాన్ని అమలు చేయడం సాధ్యం కాదని ఎంపీ ST హసన్ పేర్కొన్నారు.
Read Also: Miyapur CI suspended: మహిళపై దురుసు ప్రవర్తన.. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ సస్పెండ్
అలాగే, ఇవాళ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇది అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత స్వాతంత్య్రం తర్వాత దేశంలో యూసీసీని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అవతరిస్తుంది. అసెంబ్లీలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని అందరు భావిస్తున్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ 4 రోజుల ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆదివారం ఈ బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించింది.